పరమ5tel_otsa
1నా సోదరీ, నా వధువు, నా ఉద్యాన వనానికి వచ్చేశాను;నా పరిమళాలతో పాటు నా గోపరసాన్ని సేకరించుకున్నాను.నేను తేనెతెట్టె తేనె తిన్నాను;నేను నా ద్రాక్షరసం, నా పాలు త్రాగాను.చెలికత్తెలుస్నేహితులారా, తినండి త్రాగండి;ప్రేమికులారా! తృప్తిగా సేవించండి.2నేను నిద్ర పోతున్నానన్న మాటే గాని, నా హృదయం మేలుకొని ఉంది.వినండి! నా ప్రియుడు తలుపు తడుతూ:“తలుపు తియ్యి, నా సోదరీ, నా ప్రియురాలా!నా పావురమా, నిష్కళంకురాలా.నా తల మంచుకు తడిసింది,రాత్రి తేమకు నా వెంట్రుకలన్నీ తడిసిపోయాయి.”3నేను నా వస్త్రాన్ని తీసివేశానుదాన్ని మళ్ళీ ధరించాలా?నేను నా కాళ్లు కడుక్కున్నానుమళ్ళీ వాటిని మురికి చేసుకోవాలా?4నా ప్రియుడు తలుపు సందులో చేయి పెట్టంగానే;నా గుండె అతని కోసం కొట్టుకోవడం ప్రారంభించింది.5నా ప్రియునికి తలుపు తీద్దామని లేచాను.నా చేతులు బోళముతో తడిసి,నా వ్రేళ్ళ నుండి బోళం,తలుపు గడియ మీదికి స్రవించింది.6నా ప్రియుడికి, నేను తలుపు తీసేలోగా,ఆయన వెళ్లిపోయాడు.నా ప్రాణం స్పృహ తప్పింది.నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనబడలేదు.నేను ఆయనను పిలిచాను కాని ఆయన పలుకలేదు.7పట్టణంలో గస్తీ తిరిగేవారునాకెదురై వారు నన్ను కొట్టి, గాయపరిచారు;నా ముసుగును తొలగించారు,వారు ప్రాకారం మీద కావలివారు.8యెరూషలేము కుమార్తెలారా,నా ప్రియుడు మీకు కనిపిస్తే,ఆయనకు మీరు ఏమి చెప్తారు?ప్రేమను బట్టి నాకు స్పృహ తప్పిందని చెప్తామని ప్రమాణం చేయండి.9స్త్రీలలో అత్యంత అందమైనదానా,ఇతరులకంటే నీ ప్రియుడి విశిష్టత యేమి?ఇంతగా మాచేత ప్రమాణం చేయించుకున్నావు,ఇంతకు నీ ప్రియుడి విశేషమేమి?10నా ప్రియుడు ప్రకాశమానమైన వాడు ఎర్రని వాడు,పదివేలమంది కన్న గొప్పవాడు.11ఆయన తల మేలిమి బంగారం;ఆయనది ఉంగరాల జుట్టు,కాకి నలుపంత నల్లగా ఉన్నాయి.12ఆయన నేత్రాలునదీ తీరాన ఎగిరే గువ్వల్లాంటివి,అవి పాలలో స్నానమాడినట్లున్నాయి,ఆభరణాల్లా చెక్కబడ్డాయి.13ఆయన చెక్కిళ్ళు సువాసన ఇచ్చేపరిమళ పడకల్లాంటివి,ఆయన పెదవులు తామరలాంటివివాటిలో నుండి బోళం స్రవిస్తుంది.14ఆయన చేతులు గోమేధికం పొదిగినబంగారు కడ్డీలు,ఆయన ఉదరం నీలమణి, వైడూర్యం పొదిగినదంత కళాఖండము.15ఆయన కాళ్లు మేలిమి బంగారు దిమ్మల మీద నిలిపినపాలరాతి స్తంభాలు.ఆయన రూపం లెబానోనులా,దాని దేవదారు వృక్షాలలా ఉంది.16ఆయన నోరు అతిమధురం;ఆయన మనోహరము.యెరూషలేము కుమార్తెలారా!ఈయనే నా ప్రియుడు, నా స్నేహితుడు.