కీర్తనలు99tel_otsa

1యెహోవా పరిపాలిస్తారు,ప్రజలు భయభక్తులతో వణికి పోతున్నారు;కెరూబులకు పైగా సింహాసనాసీనుడై దేవుడు కనిపిస్తున్నారు,భూమి కంపించాలి.2సీయోను పట్టణంలో యెహోవా వైభవోపేతంగాఅందరికంటే పైన ఉన్నారు.3వారు మీ భీకరమైన గొప్ప నామాన్ని స్తుతిస్తారు,మీరు పరిశుద్ధులు.
4రాజు నిజాయితీ కలిగి న్యాయాన్ని ప్రేమిస్తాడుకాబట్టి మీరు అతన్ని సుస్థిరంగా నిలబెడతారు;యాకోబు ప్రజల పట్ల అంటే ఇశ్రాయేలీయుల పట్లనీతి నాయ్యాలు జరిగిస్తారు.5మన దేవుడైన యెహోవాను మహిమపరచండిఆయన పాదపీఠం దగ్గర ఆరాధించండి;ఆయన పవిత్రులు.
6దేవునికి చెందిన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు,యెహోవా నామాన ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు;వారు దేవునికి ప్రార్థన చేశారు,ఆయన జవాబిచ్చారు.7మేఘస్తంభంలో నుండి ఆయన మాట్లాడారు.వారు ఆయన చట్టాలు పాటించారు ఆయన ఇచ్చిన శాసనాలను వారు అమలుచేశారు.
8యెహోవా మా దేవా,మీరు వారికి జవాబిచ్చారు.మీరు వారికి క్షమించే దేవుడు,కాని వారు తప్పు చేసినప్పుడు మీరు వారిని శిక్షించారు.9మన దేవుడైన యెహోవాను ఘనపరచండిఆయన పరిశుద్ధ పర్వతం దగ్గర ఆయనను ఆరాధించండి.ఎందుకంటే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు.