కీర్తనలు98tel_otsa
ఒక కీర్తన.
1యెహోవాకు క్రొత్త పాట పాడండి,ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారు;ఆయన కుడిచేయి ఆయన పవిత్రమైన బాహువువిజయాన్ని కలిగిస్తాయి.2యెహోవా రక్షణను వెల్లడించారు.దేశాల ఎదుట తన నీతిని వెల్లడించారు.3ఇశ్రాయేలుకు తన ప్రేమను నమ్మకత్వాన్నిచూపాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు;మన దేవుని రక్షణభూమ్యంతాల వరకు కనపడింది.4భూ సమస్తమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయి,సంగీతంతో ఉత్సాహ గానం చేయి;5వీణతో యెహోవాకు సంగీత నాదం చేయి,వీణతో, గాన ధ్వనితో,6బూరలు, పొట్టేలు కొమ్ము ఊదుతూ,రాజైన యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చేయి.7సముద్రం, అందులో ఉన్నదంతా,లోకం, అందులో జీవించేవారంతా ప్రతిధ్వని చేయును గాక.8యెహోవా సన్నిధిలో నదులు చప్పట్లు కొడతాయి.పర్వతాలు ఆనందంగా పాడతాయి.9యెహోవా లోకానికి తీర్పరిగా,రాజుగా రాబోతున్నారు.ఆయన పరిపాలన ఆయన తీర్పులున్యాయసమ్మతమైనవి.