కీర్తనలు85tel_otsa
సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన.
1యెహోవా, మీ దేశానికి మీరు దయ చూపారు;యాకోబును చెర నుండి తిరిగి తీసుకువచ్చారు.2మీరు మీ ప్రజల దోషాన్ని క్షమించారువారి పాపాలన్నీ కప్పివేశారు. సెలా3మీ ఉగ్రతను మీరు ప్రక్కన పెట్టారుమీ భయంకర కోపాగ్నిని చల్లార్చుకున్నారు.4మా రక్షకుడవైన దేవా, మమ్మల్ని మరల పునరుద్ధరించండి.మామీద ఉన్న మీ కోపాన్ని విడిచిపెట్టండి.5ఎప్పటికీ మీరు మామీద కోప్పడతారా?తరతరాల వరకు మామీద మీరు కోప్పడుతూనే ఉంటారా?6మీ ప్రజలు మీలో ఆనందించేలామీరు మమ్మల్ని మరల బ్రతికించరా?7యెహోవా, మీ మారని ప్రేమను మా పట్ల చూపించండి,మీ రక్షణ మాకు అనుగ్రహించండి.8దేవుడైన యెహోవా చెప్తున్నదంతా నేను ఆలకిస్తాను;ఆయన తన ప్రజలకు, నమ్మకమైన దాసులకు సమాధానాన్ని వాగ్దానం చేస్తారు;అయితే వారు బుద్ధిహీనత వైపు తిరుగకుందురు గాక.9మన దేశంలో ఆయన మహిమ నివసించేలా,ఆయనకు భయపడేవారికి ఆయన రక్షణ ఎంతో సమీపంగా ఉంటుంది.10మారని ప్రేమ నమ్మకత్వం కలుసుకుంటాయి;నీతి సమాధానం పరస్పరం ముద్దు పెట్టుకుంటాయి.11నమ్మకత్వం భూమిలో నుండి మొలుస్తుంది,నీతి ఆకాశం నుండి తొంగి చూస్తుంది.12యెహోవా మేలైనది అనుగ్రహిస్తారు,మన భూమి తన పంటనిస్తుంది.13ఆయనకు ముందుగా నీతి వెళ్తూఆయన అడుగు జాడలకు మార్గం సిద్ధం చేస్తుంది.