కీర్తనలు75tel_otsa
సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగము మీద పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము.
1దేవా, మేము మిమ్మల్ని స్తుతిస్తాము;మీ పేరు సమీపంగా ఉన్నదని మేము మిమ్మల్ని స్తుతిస్తాం;ప్రజలు మీ అద్భుతమైన కార్యాలను గురించి చెప్పుతారు.2“నేను నిర్ణీత సమయంలో;న్యాయంగా తీర్పు తీరుస్తాను.3భూమి దాని ప్రజలంతా భయంతో వణికినప్పుడు,దాని స్తంభాలను గట్టిగా పట్టుకున్నది నేనే. సెలా4అహంకారులతో అహంకారంగా ఉండవద్దు అనిదుష్టులతో, ‘మీ కొమ్ములను ఎత్తకండి.5ఆకాశం వైపు మీ కొమ్ము ఎత్తకండి;అంత గర్వంగా మాట్లాడకండి’ ” అని మీరంటారు.6తూర్పు నుండి కాని పడమర నుండి కానిఅరణ్యం నుండి కాని ఎవరూ తమను తాము హెచ్చించుకోలేరు.7దేవుడే తీర్పు తీరుస్తారు:ఆయన ఒకని తగ్గిస్తారు, మరొకని హెచ్చిస్తారు.8యెహోవా చేతిలో ఒక పాత్ర ఉందిఅందులో సుగంధద్రవ్యాలు కలిపిన పొంగుతున్న ద్రాక్షరసం ఉంది;ఆయన దాన్ని బయటకు కుమ్మరిస్తారు, భూమిలోని దుష్టులందరుమడ్డితో సహా దాన్ని త్రాగివేస్తారు.9నేనైతే నిత్యం ప్రకటిస్తాను;యాకోబు దేవునికి నేను స్తుతి పాడతాను.10ఎందుకంటే, “దుష్టులందరి కొమ్ములను నేను విరగ్గొడతాను,కాని నీతిమంతుల కొమ్ములు హెచ్చిస్తాను” అని ఆయన అంటారు.