కీర్తనలు73tel_otsa

ఆసాపు కీర్తన.

1ఇశ్రాయేలుకు, శుద్ధ హృదయులకుదేవుడు ఖచ్చితంగా మంచివాడు.
2కానీ నా మట్టుకైతే, నా పాదాలు దాదాపు జారిపోయాయి;నా పాదం దాదాపు పట్టును కోల్పోయింది.3దుష్టుల క్షేమం నేను చూసినప్పుడునేను అహంకారుల మీద అసూయ పడ్డాను.
4వారికి ఏ బాధలు లేవు;వారి శరీరాలు ఆరోగ్యంగా బలంగా ఉన్నాయి.5సాధారణంగా మనుష్యులకు ఉండే భారాలు వారికి లేవు;మనుష్యులకు కలిగే అనారోగ్యమనే తెగులు వారికి లేదు.6కాబట్టి గర్వం వారికి కంఠహారంగా ఉంది;హింసను వారు వస్త్రంగా ధరించారు.7వారి కఠిన హృదయాల నుండి దోషం బయటికి వస్తుంది,వారి చెడు ఊహలకు హద్దులు లేవు.8వారు ఎగతాళి చేస్తారు, దురుద్దేశంతో మాట్లాడతారు;అహంకారంతో అణచివేస్తామని బెదిరిస్తారు.9వారి నోళ్ళు పరలోకంలో పాలిస్తున్నట్లు మాట్లాడుతాయి,వారి నాలుకలు భూమిపై ఆధిపత్యమున్నట్లు ప్రకటిస్తాయి.10అందువల్ల వారి ప్రజలు వారివైపు తిరుగుతారువారి మాటలను మంచినీరు త్రాగినట్లు త్రాగుతారు.11“దేవునికి ఎలా తెలుస్తుంది?మహోన్నతునికి ఏదైనా తెలుసా?” అని వారనుకుంటారు.
12దుష్టులు ఇలా ఉంటారు.ఎప్పుడూ ఏ జాగ్రత్తలు లేకుండ సంపద కూడబెట్టుకుంటారు.
13నేను నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమేనేను నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే.14రోజంతా నేను బాధింపబడ్డాను,ప్రతి ఉదయం నూతన శిక్షలు వస్తున్నాయి.
15నేను అలా మాట్లాడాలని అనుకుని ఉంటే,నేను మీ పిల్లలను మోసం చేసినట్టే.16ఇదంతా నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు,నేను దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించే వరకుఅది నన్ను గాఢంగా ఇబ్బంది పెట్టింది;అప్పుడు నేను వారి చివరి గమ్యమేంటో గ్రహించాను.
18ఖచ్చితంగా మీరు వారిని జారే నేలపై ఉంచారు;మీరు వారిని పతనానికి పడవేస్తారు.19వారు అకస్మాత్తుగా నాశనమవుతారు,వారు భయంతో పూర్తిగా నశిస్తారు!20ప్రభువా, మీరు లేచినప్పుడు,ఒకరు మేల్కొన్నప్పుడు ఒక కలలో చూసినవి మరచినట్లు;మీరు వారి ఉనికిని తృణీకరిస్తారు.
21నా హృదయం దుఃఖించినప్పుడునా ఆత్మ నీరసించినప్పుడు,22నేను తెలివిలేని వాడను, అజ్ఞానిని;మీ ఎదుట నేను క్రూరమైన మృగంలా ఉన్నాను.
23అయినా నేనెల్లప్పుడు మీతో ఉన్నాను;మీరు నా కుడిచేయి పట్టుకున్నారు.24మీ ఆలోచనచేత నన్ను నడిపిస్తున్నారు,తర్వాత నన్ను పరలోక మహిమలో చేర్చుకుంటారు.25పరలోకంలో మీరు తప్ప నాకెవరున్నారు?మీరు తప్ప ఈ లోకంలో నాకేమి అక్కర్లేదు.26నా శరీరం నా హృదయం నీరసిస్తాయేమో,కాని నిత్యం నా దేవుడు నా హృదయానికి బలంనిత్యం నా స్వాస్థ్యం.
27మీకు దూరంగా ఉన్నవారు నశిస్తారు;మిమ్మల్ని విడిచి వ్యభిచారులుగా ప్రవర్తించే వారందరినీ మీరు నాశనం చేస్తారు.28కాని నా మట్టుకైతే, నేను దేవునికి సమీపంగా ఉంటాను.నేను ప్రభువైన యెహోవాను ఆశ్రయంగా చేసుకున్నాను;మీ క్రియలన్నిటిని గురించి నేను ప్రకటిస్తాను.