కీర్తనలు67tel_otsa
ప్రధాన గాయకునికి. తంతివాద్యాలతో పాడదగినది. ఒక కీర్తన. ఒక గీతము.
1దేవుడు మామీద దయచూపి దీవించును గాక,ఆయన ముఖం మాపై ప్రకాశించును గాక. సెలా2తద్వార భూమి మీద మీ మార్గాలుదేశాలన్నిటికి మీ రక్షణ తెలుస్తాయి,3దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక;సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.4దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక,ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారుభూమి మీద దేశాలను పాలిస్తారు. సెలా5దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక;సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.6భూమి దాని పంటను ఇస్తుంది;దేవుడు, మా దేవుడు, మమ్మల్ని దీవిస్తారు.7అవును, దేవుడు మనల్ని దీవించును గాక,తద్వార భూదిగంతాలలో ఉన్న ప్రజలంతా ఆయనకు భయపడుదురు గాక.