కీర్తనలు63tel_otsa

దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన.

1దేవా, మీరు నా దేవుడు,నేను ఆశగా మిమ్మల్ని వెదకుతున్నాను;నీరు లేక ఎండిపోయి పొడిగా ఉన్న దేశంలో,నేను మీ కోసం దప్పిగొన్నాను,నా శరీరమంతామీ కోసం ఆశపడుతుంది.
2పరిశుద్ధాలయంలో నేను మిమ్మల్ని చూశాను.మీ ఘనతా మహిమను తేరి చూశాను3మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమంనా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి.4నా జీవితకాలమంతా నేను మిమ్మల్ని స్తుతిస్తాను.మీ పేరును బట్టి నా చేతులు ఎత్తుతాను.5శ్రేష్ఠమైన ఆహారం దొరికినట్లు నేను సంతృప్తి పొందుతాను;సంతోషించే పెదవులతో నా నోరు మిమ్మల్ని స్తుతిస్తుంది.
6పడక మీద నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను;రాత్రి జాముల్లో నేను మీ గురించి ఆలోచిస్తాను.7మీరు నాకు సహాయం కాబట్టిమీ రెక్కల నీడలో నేను ఆనందంతో పాడతాను.8నేను మీకు అంటిపెట్టుకుని ఉంటాను;మీ కుడిచేయి నన్ను ఆదుకుంటుంది.
9నన్ను ఎవరు చంపాలని చూస్తారో వారే నాశనం అవుతారు;వారు భూమి అగాధ స్థలాలకు దిగిపోతారు.10వారు ఖడ్గానికి అప్పగించబడినక్కలకు ఆహారం అవుతారు.
11కాని రాజు దేవునియందే ఆనందిస్తాడు;దేవుని మీద ప్రమాణం చేసే వారందరు ఆయనయందు అతిశయిస్తారు.కాని అబద్ధికుల నోళ్ళు మౌనంగా ఉంటాయి.