కీర్తనలు6tel_otsa

సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది.బహుశ షమినీతుఎనిమిది తంతుల వాయిద్యం కావచ్చు.దావీదు కీర్తన.

1యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండిమీ ఉగ్రతలో నన్ను శిక్షించకండి.2యెహోవా, నేను బలహీనుడను, నాపై దయ చూపండి;యెహోవా, నా ఎముకలు వేదనలో ఉన్నాయి, నన్ను బాగుచేయండి.3నా ప్రాణం తీవ్ర వేదనలో ఉంది.ఎంతకాలం, యెహోవా, ఇంకెంత కాలం?
4యెహోవా, తిరిగి రండి, నన్ను విడిపించండి;మీ మారని ప్రేమను బట్టి నన్ను రక్షించండి.5మృతులు ఉండే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోరుసమాధి నుండి ఎవరు మీకు స్తుతులు చెల్లిస్తారు?
6మూలుగుతూ నేను అలిసిపోయాను.రాత్రంతా నేను కార్చిన కన్నీటిలో నా పరుపు తడిసిపోతుందికన్నీటిలో నా మంచం మునిగిపోతుంది.7విచారంతో నా కళ్లు మసకబారుతున్నాయి.నా శత్రువులందరిని బట్టి అవి క్షీణిస్తున్నాయి.
8యెహోవా నా మొర ఆలకించారు,కాబట్టి చెడు చేసేవారలారా, నా నుండి దూరంగా వెళ్లండి.9కనికరం కోసం చేసిన నా మొరను యెహోవా ఆలకించారు;యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తారు.10నా శత్రువులందరు సిగ్గుపడి అధిక వేదన పొందుతారు;వారు హఠాత్తుగా సిగ్గుపడి వెనుదిరుగుతారు.