కీర్తనలు39tel_otsa
సంగీత దర్శకుడైన యెదూతూనుకు. దావీదు కీర్తన.
1నేను, “నేను నా నాలుకతో పాపం చేయకుండా ఉండడానికినా మార్గాలను సరిచూసుకుంటాను;దుష్టులు నా దగ్గర ఉన్నప్పుడునా నోటికి చిక్కం పెట్టుకుంటాను” అని అన్నాను.2అందువల్ల నేను ఏమీ మాట్లాడకుండాపూర్తిగా మౌనంగా ఉండిపోయాను.కానీ నా వేదన అధికమయ్యింది;3నా గుండె నాలో వేడెక్కింది.నేను ధ్యానిస్తూ ఉండగా మంట రగులుకుంది;అప్పుడు నోరు తెరచిమాట్లాడాను:4“యెహోవా, నా జీవిత ముగింపునా రోజుల సంఖ్యను నాకు చూపించండి;నా జీవితం ఎంత అనిశ్చయమైనదో నాకు తెలియజేయండి.5మీరు నా దినాలను కేవలం బెత్తెడంత చేశారు;నా జీవితకాలం మీ ఎదుట శూన్యము.భద్రత గలవారిగా అనిపించినా,మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా6“నిశ్చయంగా మనుష్యులు కేవలం నీడలా తిరుగుతున్నారు;వారి ధనం ఎవరికి దక్కుతుందో తెలియకుండానేవారు వ్యర్థంగా ధనం సమకూర్చుకుంటారు.7“కాని ప్రభువా, ఇప్పుడు నేను దేనికోసం చూస్తున్నాను?మీలోనే నా నిరీక్షణ.8నా అతిక్రమాలన్నిటి నుండి నన్ను విడిపించండి;మూర్ఖులు ఎగతాళి చేయడానికి నన్ను లక్ష్యంగా చేయకండి.9ఇదంతా చేసింది మీరే కాబట్టినేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను.10దయచేసి నన్ను కొట్టడం ఆపేయండి;మీ చేతి దెబ్బలకు నేను అలసిపోతున్నాను.11మీరు మనుష్యులను వారి పాపం విషయంలో మందలించినప్పుడు,చిమ్మెటలా మీరు వారి సంపదను హరించివేస్తారు.మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా12“యెహోవా, నా ప్రార్థన వినండి,నా మొర ఆలకించండి.నా ఏడ్పును చూసి కూడా పట్టనట్లుగా ఉండకండి.నా పూర్వికుల్లాగే నేను కూడా ఓ పరదేశిగా ఉన్నాను.13నేను గతించిపోకముందు మళ్ళీ ఆనందించేలామీ చూపును నా నుండి త్రిప్పివేయండి.”