కీర్తనలు29tel_otsa
దావీదు కీర్తన.
1దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి,మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి.2యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే ఆపాదించండి;ఆయన పరిశుద్ధ వైభవాన్ని బట్టి యెహోవాను ఆరాధించండి.3యెహోవా స్వరం సముద్రం మీద ప్రతిధ్వనిస్తుంది;మహిమగల దేవుడు ఉరుముతారుమహాజలాల మీద యెహోవా స్వరం ప్రతిధ్వనిస్తోంది.4యెహోవా స్వరం శక్తివంతమైనది;యెహోవా స్వరం ఘనమైనది.5యెహోవా స్వరానికి దేవదారు చెట్లు విరిగి పడిపోతాయి;లెబానోను దేవదారు చెట్లను యెహోవా ముక్కలుగా చేస్తారు.6ఆయన లెబానోను పర్యతాలను దూడలా,షిర్యోనును అడవి దూడలా చెంగున గంతులు వేసేలా చేస్తారు.7యెహోవా స్వరంఅగ్ని జ్వాలలను పుట్టిస్తుంది;8యెహోవా స్వరం ఎడారిని వణికిస్తుంది.యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తారు.9యెహోవా స్వరం లేళ్లను ఈనజేస్తుందిఅడవిలోని ఆకులు రాలిపోయేలా చేస్తుంది.ఆయన ఆలయంలోని సమస్తం ఆయనకే, “మహిమ” అంటున్నాయి.10యెహోవా ప్రళయజలాల మీద ఆసీనులయ్యారు;ఆయనే నిరంతరం రాజుగా పరిపాలిస్తున్నారు.11యెహోవా తన ప్రజలకు బలాన్ని దయచేస్తారు;యెహోవా సమాధానంతో తన ప్రజలను ఆశీర్వదిస్తారు.