కీర్తనలు16tel_otsa

దావీదు శ్రేష్ఠమైనకీర్తన.

1నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను,నన్ను కాపాడండి.
2యెహోవాతో నేను, “మీరు నా ప్రభువు;మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు” అని చెప్తాను.3భూమి మీద ఉన్న పరిశుద్ధ ప్రజల గురించి నేను ఇలా చెప్తాను,“వారు మహనీయులు, వారిలోనే నా ఆనందం అంతా ఉంది.”4వేరే దేవుళ్ళ వెంటపడేవారికి కష్టాలు ఎక్కువవుతాయి.వారి రక్తార్పణలలో నేను పాల్గొననునా పెదవులతో వారి పేర్లు కూడా పలకను.
5యెహోవా మీరు మాత్రమే నా భాగము, నా పాత్ర.మీరు నా భాగాన్ని భద్రపరుస్తారు.6మనోహరమైన స్థలాల్లో నా కోసం హద్దులు గీసి ఉన్నాయి;ఖచ్చితంగా నాకు ఆనందకరమైన వారసత్వం ఉంది.7నాకు ఆలోచన చెప్పే యెహోవాను నేను స్తుతిస్తాను,రాత్రివేళలో కూడా నా హృదయం నాకు హితవు చెప్తుంది.8ఎల్లప్పుడు నేను నా ఎదుట యెహోవాను చూస్తున్నాను.ఆయన నా కుడి ప్రక్కనే ఉన్నారు, కాబట్టి నేను కదల్చబడను.
9కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది;నా శరీరం కూడా క్షేమంగా విశ్రమిస్తుంది.10ఎందుకంటే, మీరు నన్ను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు,మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.11మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు;మీ సన్నిధిలోని ఆనందంతోమీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో నన్ను నింపుతారు.