కీర్తనలు15tel_otsa

దావీదు కీర్తన.

1యెహోవా, మీ పవిత్ర గుడారంలో ఉండగలవారు ఎవరు?మీ పరిశుద్ధ పర్వతంపై నివసించగలవారు ఎవరు?
2నిందారహితంగా నడుచుకొనేవారు,నీతిని జరిగించేవారు,తమ హృదయం నుండి సత్యాన్ని మాట్లాడేవారు;3తమ నాలుకతో అపవాదులు వేయనివారు,పొరుగువారికి కీడు చేయనివారు,స్నేహితుల గురించి చెడుగా మాట్లాడనివారు;4నీచులను అసహ్యించుకునియెహోవాకు భయపడేవారిని గౌరవించేవారు;తమకు బాధ కలిగినా తాము చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునేవారు,తమ మనస్సు మార్చుకొననివారు;5వడ్డీ తీసుకోకుండ బీదలకు డబ్బు అప్పిచ్చేవారు;నిర్దోషులకు వ్యతిరేకంగా లంచం తీసుకోనివారు.వీటిని చేసేవారుఎన్నటికి కదిలించబడరు.