కీర్తనలు149tel_otsa
1యెహోవాను స్తుతించండి.యెహోవాకు క్రొత్త పాట పాడండి,ఆయన యొక్క నమ్మకమైన ప్రజల సమాజంలో స్తుతి పాడండి.2ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తలో సంతోషించును గాక;సీయోను ప్రజలు తమ రాజులో ఆనందించుదురు గాక.3వారు ఆయన నామాన్ని నాట్యం చేస్తూ స్తుతిస్తారుతంబురతో సితారాతో గానం చేస్తారు.4యెహోవా తన ప్రజల్లో ఆనందిస్తారు;దీనులకు విజయాన్ని కిరీటంగా ధరింపజేస్తారు.5ఆయన యొక్క నమ్మకమైన ప్రజలు ఈ ఘనతలో సంతోషించుదురు గాక.వారు వారి పడకలో ఆనందంతో పాడుదురు గాక.6వారి నోళ్ళలో దేవుని స్తుతివారి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉండును గాక.7దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికిప్రజలను శిక్షించడానికి,8వారి రాజులను సంకెళ్ళతో,ఉక్కు సంకెళ్ళతో వారి సంస్థానాధిపతులను బంధించడానికి,వారికి వ్యతిరేకంగా వ్రాయబడిన తీర్పు అమలుచేసేలా ఇది ఉంటుంది,ఆయన యొక్క నమ్మకమైన ప్రజలందరికి ఈ ఘనత ఉంటుంది.యెహోవాను స్తుతించండి.