కీర్తనలు125tel_otsa
యాత్రకీర్తన.
1యెహోవాపై నమ్మకము ఉంచేవారుకదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.2యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు,ఇప్పుడు ఎల్లప్పుడుయెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు.3నీతిమంతులకు కేటాయించబడిన భూమి మీదదుష్టుల రాజదండం మీద నిలిచి ఉండదు,లేకపోతే నీతిమంతులు పాపం చేయడానికితమ చేతులను ఉపయోగిస్తారు.4యెహోవా, మంచివారికియథార్థ హృదయం గలవారికి మేలు చేయండి.5అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారినిదుష్టులతో పాటు బహిష్కరిస్తారు.ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.