కీర్తనలు124tel_otsa

దావీదు యాత్రకీర్తన.

1మనుష్యులు మనపై దాడి చేసినప్పుడువారి కోపం మనపై రగులుకొన్నప్పుడుయెహోవా మనకు తోడై ఉండకపోతేవారు మనల్ని సజీవంగానే మ్రింగివేసేవారు;వరద మన మీదుగా పొర్లి ఉండేది,జలప్రవాహం మనల్ని ముంచేసిజలప్రవాహాల పొంగు మనల్ని తుడిచిపెట్టి ఉండేదిఅని ఇశ్రాయేలు చెప్పును గాక.
6వారి పళ్లు మనల్ని చీల్చివేయటానికి అనుమతించనియెహోవాకు స్తుతి చెల్లును గాక.7వేటగాని ఉరి నుండి పక్షి తప్పించుకున్నట్లుగామనం తప్పించుకున్నాము;ఉరి తెగిపోయింది,మనం తప్పించుకున్నాము.8భూమ్యాకాశాలను సృజించినయెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది.