కీర్తనలు120tel_otsa
యాత్రకీర్తన.
1నా బాధలో యెహోవాకు మొరపెడతాను,ఆయన నాకు జవాబిస్తారు.2యెహోవా, అబద్ధమాడే పెదవుల నుండిమోసకరమైన నాలుక నుండినన్ను రక్షించండి.3ఓ మోసకరమైన నాలుకా,దేవుడు నీకేం చేస్తారు?ఆయన ఇంతకన్నా ఎక్కువగా నీకేం చేస్తారు?4వీరుల పదునైన బాణాలతో,మండుతున్న బదరీ మొక్కల నిప్పులతో ఆయన నిన్ను శిక్షిస్తారు.5నేను మెషెకులో నివసించినందుకు,కేదారు గుడారాల మధ్యలో జీవించినందుకు నాకు శ్రమ!6సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలోచాలా కాలం నివసించాను.7నేను సమాధానం కోరుతున్నాను;కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు.