కీర్తనలు12tel_otsa
సంగీత దర్శకునికి. షెమినీతువాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన.
1యెహోవా, సహాయం చేయండి, ఎందుకంటే ఒక్కరైన నమ్మకమైనవారు లేరు;నమ్మకమైనవారు మనుష్యజాతి నుండి గతించిపోయారు.2ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడుతున్నారు;వారు తమ హృదయాల్లో మోసం పెట్టుకునితమ పెదవులతో పొగడుతారు.3పొగిడే ప్రతి పెదవినిగొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను యెహోవా మౌనం చేయును గాక.4“మా నాలుకలతో మేము గెలుస్తాం;మా పెదవులు మమ్మల్ని కాపాడతాయి; మామీద ప్రభువెవరు?”అని వారంటారు.5“దీనులు దోపిడికి గురవుతున్నారు,అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక,నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను”అని యెహోవా అంటున్నారు.6యెహోవా మాటలు నిర్దోషమైనవి,అవి మట్టి మూసలో శుద్ధి చేసిన వెండిలా పవిత్రమైనవి,ఏడుసార్లు శుద్ధి చేయబడిన బంగారం లాంటివి.7యెహోవా, అవసరంలో ఉన్నవారిని మీరు క్షేమంగా ఉంచుతారుఈ చెడ్డతరం వారి నుండి నిత్యం కాపాడతారు,8మానవులలో నీచ ప్రవర్తన ఎక్కువైనప్పుడు,దుష్టులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు.