కీర్తనలు118tel_otsa
1యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి;ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.2“ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది”అని ఇశ్రాయేలీయులు చెప్పుదురు గాక.3“ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది”అని అహరోను వంశం చెప్పుదురు గాక.4“ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది”అని యెహోవాకు భయపడేవారు చెప్పుదురు గాక.5నేను ఇరుకులో ఉండి యెహోవాకు మొరపెట్టాను;ఆయన నాకు జవాబిచ్చి నన్ను విశాల స్థలంలోకి తెచ్చారు.6యెహోవా నా పక్షాన ఉన్నారు; నేను భయపడను.నరమాత్రులు నన్నేమి చేయగలరు?7యెహోవా నా పక్షాన ఉన్నారు; ఆయన నా సహాయకుడు.నా శత్రువుల వైపు నేను విజయం పొందినవానిగా చూస్తాను.8మనుష్యులను నమ్మడం కంటేయెహోవాను ఆశ్రయించడం మంచిది.9రాజులను నమ్మడం కంటేయెహోవాను ఆశ్రయించడం మంచిది.10దేశాలన్నీ నన్ను చుట్టుముట్టాయి,కాని యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.11వారు ప్రతి వైపు నుండి నన్ను చుట్టుముట్టారు,కాని యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.12వారు కందిరీగల్లా నా చుట్టూ తిరిగారు,కాని మండుతున్న ముళ్ళపొదల్లా వారు త్వరగా కాలిపోయారు;యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.13శత్రువు నన్ను బలంగా గెంటివేశాడు,నేను పడిపోయి ఉండే వాడినే కాని యెహోవా నాకు సహాయం చేశారు.14యెహోవా నా శక్తి, నా బలం ;ఆయనే నా రక్షణ అయ్యారు.15నీతిమంతుల గుడారాల్లోరక్షణానంద కేకలు ప్రతిధ్వనిస్తాయి:“యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!16యెహోవా కుడి హస్తం పైకి ఎత్తబడింది;యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!”17నేను చావను కాని బ్రతికి ఉండి,యెహోవా చేసిన దానిని ప్రకటిస్తాను.18యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించారు,కాని ఆయన నన్ను చావుకు అప్పగించలేదు.19నా కొరకు నీతిమంతుల గుమ్మాలను తెరవండి;నేను లోపలికి ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తాను.20ఇది యెహోవా గుమ్మంనీతిమంతులు దీని గుండా ప్రవేశిస్తారు.21మీరు నాకు జవాబిచ్చారు, కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను;మీరు నాకు రక్షణ అయ్యారు.22ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయిమూలరాయి అయ్యింది;23ఇది యెహోవా చేశారు,ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.24ఇది యెహోవా చేసిన దినంఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.25యెహోవా, మమ్మల్ని రక్షించండి!యెహోవా, మాకు విజయం ప్రసాదించండి!26యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!యెహోవా మందిరం నుండి మేము మిమ్మల్ని దీవిస్తాము.27యెహోవాయే దేవుడు,ఆయన తన వెలుగును మనమీద ప్రకాశింపజేశారు.త్రాళ్లతో అర్పణనుబలిపీఠం కొమ్ములకు కట్టెయ్యండి.28మీరు నా దేవుడు, నేను మిమ్మల్ని స్తుతిస్తాను;మీరు నా దేవుడు, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను.29యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి;ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.