కీర్తనలు1tel_otsa
1దుష్టుల సలహాను పాటించకపాపులు కోరుకునే మార్గంలో నిలబడకఎగతాళి చేసేవారిగుంపుతో కూర్చోక,2యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ,రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులు.3వారు నీటికాలువల ప్రక్కన నాటబడి,ఆకులు వాడిపోకుండ,సరియైన కాలంలో ఫలమిచ్చే చెట్టులా ఉంటారువారు చేసేవాటన్నిటిలో వృద్ధిచెందుతారు.4అయితే దుష్టులు అలా ఉండరు!వారు గాలికి కొట్టుకుపోయేపొట్టులా ఉంటారు.5కాబట్టి న్యాయతీర్పులో దుష్టులు,నీతిమంతుల సభలో పాపులు నిలబడరు.6నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు,దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది.