సామెతలు15tel_otsa

1మృదువైన మాట కోపాన్ని చల్లార్చుతుంది,నొప్పించే మాట కోపం రేపుతుంది.
2జ్ఞానుల నాలుక తెలివితో అలంకరించబడుతుంది,బుద్ధిహీనుని నోరు మూర్ఖత్వాన్ని కుమ్మరిస్తుంది.
3యెహోవా కళ్లు ప్రతిచోట ఉంటాయి,చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉంటాయి.
4నెమ్మది గల నాలుక జీవ వృక్షముకాని పనికిమాలిన నాలుక ఆత్మకు భంగము కలుగజేస్తుంది.
5మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడుకాని దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకాన్ని కనుపరచుతాడు.
6నీతిమంతుని ఇంట్లో గొప్ప ధననిధి ఉన్నది,కాని దుష్టుని కలుగు వచ్చుబడి కష్టానికి కారణము.
7జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లునుబుద్ధిహీనుల హృదయం నిలకడయైనది కాదు.
8భక్తిలేనివారు అర్పించు బలులు యెహోవాకు అసహ్యం,అయితే యథార్థవంతుల ప్రార్ధన ఆయనకు సంతోషకరము.
9దుష్టుల మార్గాన్ని యెహోవా అసహ్యించుకుంటారు,నీతిని అనుసరించేవారిని ఆయన ప్రేమిస్తారు.
10దారితప్పిన వానికి కఠిన శిక్ష కలుగును,గద్దింపును ద్వేషించువారు చావునొందుదురు.
11మరణం, నాశనం యెహోవాకు కనబడతాయి,ఆయనకు మనుష్యుల హృదయాలు ఇంకా తేటగా కనిపిస్తాయి కదా!
12ఎగతాళి చేసేవారికి సరిదిద్దేవారంటే ఇష్టముండదు,కాబట్టి జ్ఞానుల దగ్గరకు వెళ్లరు.
13హృదయంలో ఆనందం ముఖాన్ని వికసింపజేస్తుంది,మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.
14వివేకంగల హృదయం తెలివిని వెదకుతుంది,కాని బుద్ధిహీనునికి మూర్ఖత్వమే ఆహారము.
15బాధింపబడుచున్న వారి రోజులన్నీ బాధాకరమే,కాని సంతోష హృదయం గలవారికి ఎప్పుడూ విందే.
16నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే,కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు.
17ద్వేషం కలిగిన చోట క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే,ప్రేమ ఉన్నచోట ఆకుకూరల భోజనం తినడం మేలు.
18ఉద్రేకంతో కూడిన కోపం తగాదా రేపుతుంది,దీర్ఘశాంతం తగాదాను శాంతింపజేస్తుంది.
19సోమరి వాని బాట ముండ్లకంచె,యథార్థవంతుల త్రోవ రహదారి.
20జ్ఞానంగల పిల్లలు తండ్రిని సంతోషపరుస్తారు,కానీ మూర్ఖపు మనుష్యులు తమ తల్లిని తృణీకరిస్తారు.
21బుద్ధిహీనుని వానికి అవివేకం ఆనందాన్నిస్తుంది,కాని అవగాహన ఉన్నవాడు చక్కగా నడుచుకొనును.
22ఆలోచనలు చెప్పువారు లేనిచోట తలంపులు వృధాయగును,ఆలోచన చెప్పువారు ఎక్కువ మంది ఉన్న ఎడల తలంపులు బలపడును.
23సరిగా జవాబునిచ్చిన వానికి దాని వలన సంతోషము కలుగును,సమయానికి తగిన మాట ఎంతో మంచిది.
24క్రిందనున్న మరణాన్ని తప్పించుకోవాలని,వివేకవంతులను జీవమార్గం పైకి నడిపిస్తుంది.
25గర్వించువారి ఇల్లు యెహోవా పెరికివేయును,భర్తలేని స్త్రీ పొలిమేరను ఆయన స్ధాపించును.
26దుష్టుల ఆలోచనలు యెహోవాకు అసహ్యం,దయగల మాటలు ఆయనకు పవిత్రము.
27అత్యాశ తన ఇంటివారి మీదికి పతనాన్ని తెస్తుంది,లంచాన్ని అసహ్యించుకునేవారు బ్రతుకుతారు.
28నీతిమంతుల హృదయం సరియైన జవాబివ్వడానికి ప్రయత్నిస్తుంది,భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరిస్తుంది.
29భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటారు,నీతిమంతుల ప్రార్ధన ఆయన అంగీకరిస్తారు.
30సంతోషకరమైన చూపు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది,మంచి వార్త ఎముకలకు బలాన్నిస్తుంది.
31జీవితాన్ని ప్రసాదించే దిద్దుబాటును అంగీకరించేవారుజ్ఞానుల సహవాసంలో ఉంటారు.
32క్రమశిక్షణను తృణీకరించేవారు తమను తాము తృణీకరిస్తారు,అయితే దిద్దుబాటును అంగీకరించేవారు గ్రహింపు పొందుతారు.
33యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం నేర్చుకోడానికి సాధనముఘనతకు ముందు వినయం ఉంటుంది.