సంఖ్యా26tel_otsa

రెండవ జనాభా లెక్క

1తెగులు అంతరించిన తర్వాత, యెహోవా మోషేతో యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో అన్నారు,2“ఇశ్రాయేలు సమాజమంతటిని ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు ఉండి ఇశ్రాయేలు సైన్యంలో సేవ చేయగలవారిని కుటుంబాల ప్రకారం లెక్కించాలి.”3కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు, యెరికో నుండి యొర్దాను వైపు ఉన్న మోయాబు సమతల మైదానాల్లో ఇశ్రాయేలీయుల నాయకులతో మాట్లాడుతూ,4“యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉన్న పురుషులను లెక్కించండి” అని చెప్పారు.
వీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులు:
5ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన, రూబేను వారసులు: హనోకు ద్వార, హనోకీయుల వంశం; పల్లు ద్వార, పల్లువీయుల వంశం;6హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; కర్మీ ద్వార, కర్మీయుల వంశము.7ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730.8పల్లు కుమారుడు ఏలీయాబు,9ఏలీయాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. ఈ దాతాను, అబీరాములే మోషే అహరోనులకు ఎదురు తిరిగినవారు, కోరహు అనుచరులు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారి మధ్య ఉన్న అధికారులు.10భూమి నోరు తెరచుకొని కోరహుతో పాటు వారిని మ్రింగివేసింది, అతని అనుచరులు 250 మంది మంటలో హతమయ్యారు. వారు హెచ్చరిక గుర్తుగా ఉన్నారు.11అయితే, ఆ రోజున కోరహు కుమారులు చనిపోలేదు.
12షిమ్యోను వారసులు వారి వంశాల ప్రకారం: నెమూయేలు ద్వార, నెమూయేలీయుల వంశం; యామీను ద్వార, యామీనీయుల వంశం; యాకీను ద్వార, యాకీనీయుల వంశం;13జెరహు ద్వార, జెరహీయుల వంశం; షావూలు ద్వార, షావూలీయుల వంశము.14ఇవి షిమ్యోను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 22,200.
15గాదు యొక్క వారసులు వారి వంశాల ప్రకారం: సెఫోను ద్వార, సెఫోనీయుల వంశం; హగ్గీ ద్వార, హగ్గీయుల వంశం; షూనీ ద్వార, షూనీయుల వంశం;16ఓజ్ని ద్వార, ఓజ్నీయుల వంశం; ఏరీ ద్వార, ఏరీయుల వంశం;17అరోదుద్వార, అరోదీయుల వంశం; అరేలీ ద్వార, అరేలీయుల వంశము.18ఇవి గాదు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 40,500.
19యూదా కుమారులు ఏరు ఓనాను, కానీ వారు కనాను దేశంలో చనిపోయారు.20యూదా వారసులు వారి వంశాల ప్రకారం: షేలా ద్వార, షేలాహీయుల వంశం; పెరెసు ద్వార, పెరెజీయుల వంశం; జెరహు ద్వార, జెరహీయుల వంశము.21పెరెసు యొక్క వారసులు: హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; హామూలు ద్వార, హామూలీయుల వంశము.22ఇవి యూదా వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 76,500.
23ఇశ్శాఖారు వారసులు వారి వంశాల ప్రకారం: తోలా ద్వార, తోలాహీయుల వంశం; పువా ద్వార, పువీయులవంశం;24యాషూబు ద్వార, యాషూబీయుల వంశం; షిమ్రోను ద్వార, షిమ్రోనీయుల వంశము.25ఇవి ఇశ్శాఖారు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,300.
26జెబూలూను వారసులు వారి వంశాల ప్రకారం: సెరెదు ద్వార, సెరెదీయుల వంశం; ఏలోను ద్వార, ఏలోనీయుల వంశం; యహలేలు ద్వార, యహలేలీయుల వంశము.27ఇవి జెబూలూను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 60,500.
28మనష్షే ఎఫ్రాయిం వంశాల ప్రకారం యోసేపు వారసులు:29మనష్షే వారసులు: మాకీరు ద్వార, మాకీరీయుల వంశం (మాకీరు గిలాదు యొక్క తండ్రి); గిలాదు ద్వార, గిలాదీయుల వంశము.30గిలాదు వారుసులు: ఈజరు ద్వార, ఈజరీయుల వంశం; హెలెకు ద్వార, హెలెకీయుల వంశం;31అశ్రీయేలు ద్వార, అశ్రీయేలీయుల వంశం; షెకెము ద్వార, షెకెమీయుల వంశం;32షెమీదా ద్వార, షెమీదయీయుల వంశం; హెఫెరు ద్వార, హెఫెరీయుల వంశము.33(హెఫెరు కుమారుడైన సెలోఫెహాదుకు కుమారులు లేరు; అతనికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారి పేర్లు, మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా.)34ఇవి మనష్షే వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 52,700.35ఎఫ్రాయిం వారసులు వారి వంశాల ప్రకారం: షూతలహు ద్వార, షూతలహీయుల వంశం; బేకరు ద్వార, బేకరీయల వంశం; తహను ద్వార, తహనీయుల వంశము.36వీరు షూతలహు వారసులు: ఏరాను ద్వార, ఏరానీయుల వంశము.37ఇవి ఎఫ్రాయిం వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 32,500. వీరు వంశాల ప్రకారం యోసేపు వారసులు.
38బెన్యామీను వారసులు వారి వంశాల ప్రకారం: బేల ద్వార, బేలీయుల వంశం; అష్బేలు ద్వార, అష్బేలీయుల వంశం; అహీరాము ద్వార, అహీరామీయుల వంశం;39షూఫాముద్వార, షూఫామీయుల వంశం; హుఫాము ద్వార, హుఫామీయుల వంశము.40అర్దు, నయమానుల ద్వార కలిగిన బేల వారసులు: అర్దు ద్వార, అర్దీయుల వంశం; నయమాను ద్వార, నయమానీయుల వంశము.41ఇవి బెన్యామీను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,600.
42దాను వారుసులు వారి వంశాల ప్రకారం: షూహాము ద్వార, షూహామీయుల వంశము. ఇవి దాను వంశాలు:43వారంతా షూహామీయుల వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,400.
44ఆషేరు వారసులు వారి వంశాల ప్రకారం: ఇమ్నా ద్వార, ఇమ్నీయుల వంశం; ఇష్వీ ద్వార, ఇష్వీయుల వంశం; బెరీయా ద్వార, బెరీయుల వంశం;45బెరీయా వారసుల ద్వార వచ్చినవారు: హెబెరు ద్వార, హెబెరీయుల వంశం; మల్కీయేలు ద్వార, మల్కీయేలీయుల వంశము.46ఆషేరుకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు శెరహు.47ఇవి ఆషేరు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 53,400.
48నఫ్తాలి వారసులు వారి వంశాల ప్రకారం: యహజీయేలు ద్వార, యహజీయేలీయుల వంశం; గూనీ ద్వార, గూనీయుల వంశం;49యేజెరు ద్వార, యెజెరీయుల వంశం; షిల్లేము ద్వార, షిల్లేమీయుల వంశము.50ఇవి నఫ్తాలి వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,400.
51లెక్కించబడిన ఇశ్రాయేలు పురుషుల మొత్తం సంఖ్య 6,01,730.
52యెహోవా మోషేతో అన్నారు,53“పేర్ల లెక్క సంఖ్య ప్రకారం భూమిని వారసత్వంగా కేటాయించాలి.54పెద్ద గుంపుకు పెద్ద భూభాగం, చిన్న గుంపుకు చిన్న భూభాగం వారసత్వంగా ఇవ్వాలి; ప్రతి గుంపు దానిలో లెక్కించబడినవారి సంఖ్య ప్రకారం పొందుకోవాలి.55చీట్లు వేసి భూమిని పంచడం ఖచ్చితంగా చేయాలి. ప్రతి గుంపు వారి పూర్వికుల గోత్రాల పేర్ల ప్రకారం పొందుకుంటుంది.56ప్రతి వారసత్వం చీట్లు వేయడం ద్వార పెద్ద, చిన్న గుంపుల మధ్య పంచాలి.”
57వంశాల ప్రకారం లెక్కించబడిన లేవీయులు: గెర్షోను ద్వార, గెర్షోనీయుల వంశం; కహాతు ద్వార, కహాతీయుల వంశం; మెరారి ద్వార మెరారీయుల వంశము.58ఇవి కూడా లేవీ వంశాలు: లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశము. (కహాతు కుమారుడు అమ్రాము;59అమ్రాము భార్యపేరు యోకెబెదు, ఈమె లేవీ సంతానం, లేవీయులకు ఈజిప్టులో ఉన్నప్పుడు జన్మించింది. అమ్రాము వల్ల అహరోనును, మోషేను, వారి సహోదరి మిర్యామును కన్నది.60అహరోను నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారుల తండ్రి.61అయితే నాదాబు, అబీహులు, యెహోవాకు అన్యాగ్నిని అర్పించినందుకు చనిపోయారు.)
62లేవీయులలో పురుషులు ఒక నెల ఆపైన వయస్సు ఉన్న వారి సంఖ్య 23,000. ఇశ్రాయేలీయులతో వారు లెక్కించబడలేదు ఎందుకంటే వారి మధ్యలో వారికి వారసత్వం ఇవ్వబడలేదు.
63యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు మైదానంలో మోషే, యాజకుడైన ఎలియాజరు ద్వార లెక్కించబడిన ఇశ్రాయేలీయులు వీరు.64వీరిలో ఏ ఒక్కరైన మోషే, యాజకుడైన అహరోను సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్క తీసుకున్నప్పుడు ఉన్నవారు కారు.65ఎందుకంటే యెహోవా ఆ ఇశ్రాయేలీయులు అరణ్యంలో తప్పక చస్తారని చెప్పారు, యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఏ ఒక్కరు మిగల్లేదు.