విలాప2tel_otsa
1ప్రభువు తన కోపంతోసీయోను కుమార్తెను మేఘంతో కప్పివేశారు!ఆయన ఇశ్రాయేలు వైభవాన్నిఆకాశం నుండి భూమి మీదికి పడగొట్టారు;ఆయన తన కోప్పడిన దినానతన పాదపీఠాన్ని జ్ఞాపకం చేసుకోలేదు.2దయ లేకుండా ప్రభువుయాకోబు నివాసాలన్నింటినీ నాశనం చేశారు.తన కోపంలో ఆయన తన కుమార్తెయైనయూదా కోటలను పడగొట్టారు.ఆయన ఆమె రాజ్యాన్ని, దాని అధిపతులనుఅగౌరపరచి నేలకూల్చారు.3ఆయన తన కోపాగ్నిలోఇశ్రాయేలీయుల ప్రతి కొమ్మును నరికివేశారు.శత్రువు దగ్గరికి వచ్చినప్పుడుఆయన తన కుడిచేతిని వెనుకకు తీసుకున్నారు.ఆయన యాకోబులో మండుతున్న అగ్నిలా,దాని చుట్టూ ఉన్న సమస్తాన్ని దహించే మంటలా ఉన్నారు.4ఒక శత్రువులా ఆయన తన విల్లు ఎక్కుపెట్టారు;ఆయన కుడిచేయి సిద్ధంగా ఉంది.ఆయన ఒక శత్రువులాకంటికి నచ్చిన వారందరినీ చంపేశారు;ఆయన తన కోపాన్ని అగ్నిలాసీయోను కుమార్తె గుడారం మీద కుమ్మరించారు.5ప్రభువు ఒక శత్రువులా;ఇశ్రాయేలును నాశనం చేశారు.ఆమె రాజభవనాలన్నింటిని ఆయన కూల్చివేశారు,అలాగే ఆమె కోటలను నాశనం చేశారు.ఆయన యూదా కుమార్తె కోసందుఃఖాన్ని, విలాపాన్ని అధికం చేశారు.6ఆయన తన నివాసాన్ని తోటలో ఉండే ఒక పాకలా కూల్చివేశారు;ఆయన తన సమావేశ స్థలాన్ని నాశనం చేశారు.యెహోవా సీయోనును తననియమించబడిన పండుగలను, సబ్బాతులను మరచిపోయేలా చేశారు;ఆయన తన కోపాగ్నిలోరాజును, యాజకులను తిరస్కరించారు.7ప్రభువు తన బలిపీఠాన్ని తిరస్కరించి,తన పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టారు.ఆయన ఆమె రాజభవనాల గోడలనుశత్రువుల చేతికి అప్పగించారు;నియామక పండుగ రోజున చేసినట్టుగా వారుయెహోవా నివాసంలో బిగ్గరగా కేకలు వేశారు.8సీయోను కుమారి చుట్టూ ఉన్న గోడనుపడగొట్టాలని యెహోవా నిశ్చయించుకున్నారు.ఆయన కొలమానాన్ని గీసాడునాశనం చేయకూడదని తన చేతిని వెనుకకు తీసుకోలేదు.ఆయన రక్షణ వ్యవస్థ అంతటిని, గోడలను విలపించేలా చేశారు;అవి శిథిలావస్థలో ఉండిపోయాయి.9ఆమె ద్వారాలు భూమిలోకి కృంగిపోయాయి;ఆయన వాటి బంధాలను పగలగొట్టి నాశనం చేశారు.ఆమె రాజు, ఆమె అధిపతులు దేశాల్లోకి చెరకు కొనిపోబడ్డారు,ఇక ఉపదేశం లేకుండా పోయింది,ఆమె ప్రవక్తలు ఇకయెహోవా నుండి దర్శనాలను పొందుకోలేదు.10సీయోను కుమార్తె పెద్దలుమౌనంగా నేలమీద కూర్చున్నారు;తమ తలలపై ధూళి చల్లుకొనిగోనెపట్ట కట్టుకున్నారు.యెరూషలేము యువతులుతమ తలలు నేలకు వంచుకున్నారు.11ఏడ్వడం వల్ల నా కళ్లు క్షీణిస్తున్నాయి,నా లోపలి భాగాలు వేదనను అనుభవిస్తున్నాను.నా హృదయం నేలమీద కుమ్మరించబడింది,ఎందుకంటే నా ప్రజలు నాశనమయ్యారు,పిల్లలు, పసిపిల్లలునగర వీధుల్లో మూర్ఛపోయారు.12వారు తమ తల్లులతో,“తినడానికి, త్రాగడానికి ఏమి లేవా?” అని అడుగుతున్నారు,వారు గాయపడిన వారిలానగర వీధుల్లో మూర్ఛపోతున్నారు,వారి తల్లుల చేతుల్లోవారి ప్రాణాలు పోతున్నాయి.13యెరూషలేము కుమారీ!నీ గురించి ఏమి చెప్పగలను?నిన్ను దేనితో పోల్చగలను?సీయోను కుమారీ,కన్యకా! నిన్నెలా ఓదార్చడానికినిన్ను దేనితో పోల్చగలనునీకు కలిగిన గాయం సముద్రమంత లోతుగా ఉందినిన్నెవరు స్వస్థపరచగలరు?14నీ ప్రవక్తల దర్శనాలుఅబద్ధం, పనికిరానివి;చెర నుండి నిన్ను తప్పించడానికివారు నీ పాపాన్ని బయటపెట్టలేదు.వారు నీకు చెప్పిన ప్రవచనాలుఅబద్ధం, తప్పుదారి పట్టించేవి.15నీ దారిన వెళ్లేవారంతా నిన్ను చూసి,చప్పట్లు కొడతారు;వారు యెరూషలేము దిక్కు చూసిఎగతాళిగా తలలాడిస్తూ ఇలా అంటారు:“పరిపూర్ణ సౌందర్య పట్టణమని,సమస్త భూనివాసులకు ఆనంద కారణమనిఈ పట్టణాన్ని గురించేనా చెప్పుకున్నారు?”16నీ శత్రువులందరూనీకు వ్యతిరేకంగా నోరు విప్పారు.వారు ఎగతాళి చేసి పళ్లు కొరుకుతూ,“మేము ఆమెను నాశనం చేశాము.ఈ రోజు కోసమే మేము ఎదురు చూసింది;దీన్ని చూడడానికే మేము బ్రతికి ఉండింది” అని అంటారు.17యెహోవా తాను సంకల్పించింది చేశారు,చాలా కాలం క్రితం ఆయన శాసించిన,తన మాట ఆయన నెరవేర్చారు.ఆయన దయ లేకుండా నిన్ను పడగొట్టారు,శత్రువు నీ మీద సంతోషించేలా చేశారు,ఆయన నీ శత్రువుల కొమ్మును హెచ్చించారు.18ప్రజల హృదయాలుయెహోవాకు మొరపెడుతున్నాయి.సీయోను కుమారి గోడలారా,మీ కన్నీటిని నదిలాపగలు రాత్రి ప్రవహించనివ్వండి;మీకు మీరే ఉపశమనం కలిగించుకోవద్దు,మీ కళ్లకు విశ్రాంతి ఇవ్వవద్దు.19లేచి, రాత్రివేళ కేకలు వేయండి,రేయి మొదటి జామున కేకలు వేయండి.నీ హృదయాన్ని నీళ్లలాప్రభువు సన్నిధిలో కుమ్మరించండి.ప్రతి వీధి చివరిలోఆకలితో మూర్ఛపోయినమీ పిల్లల ప్రాణాల కోసంఆయన వైపు మీ చేతులు ఎత్తండి.20“చూడండి, యెహోవా, ఆలోచించండి:మీరు ఇంతకుముందు ఎవరితోనైనా ఇలా వ్యవహరించారా?స్త్రీలు తమ సంతానాన్ని తినాలా,తాము పెంచిన పిల్లలను తినాలా?యాజకుడు, ప్రవక్తప్రభువు యొక్క పరిశుద్ధాలయంలో చంపబడాలా?21“చిన్నవారు, పెద్దవారు కలిసివీధుల్లోని దుమ్ములో పడుకుంటారు;నా యువకులు, యువతులుఖడ్గం చేత చంపబడ్డారు.మీరు కోప్పడిన దినాన మీరు వారిని చంపారు;మీరు జాలి లేకుండా వారిని వధించారు.22“మీరు ఒక పండుగ దినానికి పిలిచినట్లు,నాకు వ్యతిరేకంగా ప్రతి వైపు నుండి భయాందోళనలు పిలిచారు.యెహోవా ఉగ్రత దినానఎవరూ తప్పించుకోలేదు, బ్రతకలేదు;నేను అపురూపంగా పెంచుకొన్న వారినినా శత్రువు నాశనం చేశాడు.”