1ఇది పెతూయేలు కుమారుడైన యోవేలుకు వచ్చిన యెహోవా వాక్కు.
మిడతల దండు
2పెద్దలారా, దీనిని వినండి;దేశ నివాసులారా, మీరంతా ఆలకించండి.ఇప్పుడు జరుగుతున్నది, మీ కాలంలో గాని,మీ పూర్వికుల కాలంలో గాని ఎప్పుడైనా జరిగిందా?3ఈ సంగతి మీ పిల్లలకు చెప్పండి,మీ పిల్లలు తమ పిల్లలకు చెప్పాలి,వారి పిల్లలు రాబోయే తరం వారికి చెప్పాలి.4మిడతల గుంపు విడిచిపెట్టిన దానినిపెద్ద మిడతలు తినేశాయి;పెద్ద మిడతలు విడిచిపెట్టిన దానినిచిన్న మిడతలు తినేశాయి;చిన్న మిడతలు విడిచిపెట్టిన దానినిఇతర మిడతలు తినేశాయి.5త్రాగుబోతులారా, మేల్కొని ఏడవండి!ద్రాక్షరసం త్రాగే మీరందరు విలపించండి;క్రొత్త ద్రాక్షరసం కోసం విలపించండి,ఎందుకంటే అది మీ నోటి పెదవుల దగ్గర నుండి తీసివేయబడింది.6లెక్కలేనంత గొప్ప సైన్యం ఉన్న ఒక దేశం,నా దేశాన్ని ఆక్రమించింది;దానికి సింహం పళ్లు ఉన్నాయిఆడసింహం కోరలు ఉన్నాయి.7అది నా ద్రాక్ష చెట్లను పాడుచేసిందినా అంజూర చెట్లను నాశనం చేసింది.అది వాటి బెరడు ఒలిచి పడవేసినందుకు,చెట్ల కొమ్మలు తెల్లగా కనిపించాయి.8తన యవ్వన భర్తను కోల్పోయి గోనెపట్ట కట్టుకుని,దుఃఖించే కన్యలా దుఃఖించండి.9భోజనార్పణలు పానార్పణలుయెహోవా మందిరంలోకి రాకుండ నిలిచిపోయాయి.యెహోవ ఎదుట సేవచేసేయాజకులు శోకంలో ఉన్నారు.10పొలాలు పాడయ్యాయి,నేల ఎండిపోయింది;ధాన్యం నాశనమైంది,క్రొత్త ద్రాక్షరసం ఎండిపోయింది,ఒలీవనూనె అయిపోయింది.11రైతులారా, నిరాశ చెందండి,ద్రాక్షలను పెంచే వారలారా, విలపించండి,గోధుమ, యవల కోసం దుఃఖించండి,ఎందుకంటే పొలం పంట పాడైపోయింది.12ద్రాక్ష ఎండిపోయిందిఅంజూర చెట్టు వాడిపోయింది;దానిమ్మ, తాటి చెట్టు, ఆపిల్ పండు చెట్లు,పొలం లోని చెట్లన్నీ ఎండిపోయాయి.ఖచ్చితంగా మనుష్యులకు ఆనందంలేకుండా పోయింది.
విలపించండి అని పిలుపు
13యాజకులారా, మీరు గోనెపట్ట కట్టుకుని ఏడవండి;బలిపీఠం దగ్గర సేవ చేసేవారలారా, మీరు రోదించండి.నా దేవుని ఎదుట సేవ చేసేవారలారా,రండి, రాత్రంత గోనెపట్ట కట్టుకుని గడపండి;ఎందుకంటే దేవుని మందిరంలోకిభోజనార్పణలు పానార్పణలు రాకుండ నిలిచిపోయాయి.14పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి;పరిశుద్ధ సభను నిర్వహించండి.మీ దేవుడైన యెహోవా మందిరానికి వచ్చి,యెహోవాకు మొరపెట్టడానికిపెద్దలను పిలిపించండి,దేశవాసులందరిని పిలిపించండి.15యెహోవా దినం దగ్గరపడింది;అయ్యో! ఆ దినంనాశనంలా సర్వశక్తుని నుండి వస్తుంది.16మన కళ్లెదుటేదేవుని మందిరంలోఆహారం నిలిపివేయబడలేదాసంతోషం ఆనందం నిలిచిపోలేదా?17విత్తనాలు మట్టిగడ్డల క్రింద కుళ్లిపోతున్నాయి.ధాన్యం ఎండిపోవడంతో,గిడ్డంగులు పాడైపోయాయిధాన్యాగారాలు పడగొట్టబడ్డాయి.18తినడానికి మేత లేకపశువులు ఎంతగానో మూలుగుతున్నాయి!మందలు అటూ ఇటూ తిరుగుతున్నాయి;గొర్రెల మందలు కూడా శిక్షను అనుభవిస్తున్నాయి.19యెహోవా మీకు నేను మొరపెడుతున్నాను,ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లను అగ్ని కాల్చివేసిందిపొలం లోని చెట్లన్నిటిని మంటలు కాల్చివేశాయి.20కాలువలు ఎండిపోయాయి;అరణ్యంలో అగ్ని పచ్చికబయళ్లను కాల్చివేసిందిమీ కోసం అడవి జంతువులు కూడా దాహంతో ఉన్నాయి.