యోబు39tel_otsa
1“కొండమీద తిరిగే అడవి మేకలు ఎప్పుడు ఈనుతాయో నీకు తెలుసా?లేళ్లు పిల్లలను కంటున్నప్పుడు నీవు చూశావా?2అవి ఎన్ని నెలల వరకు మోస్తాయో నీవు లెక్కపెడతావా?అవి పిల్లలను కనే సమయం నీకు తెలుసా?3అవి వంగి తమ పిల్లలకు జన్మనిస్తాయి;వాటి పురుటినొప్పులు అంతలోనే ఆగిపోతాయి.4వాటి పిల్లలు అడవిలో పెరిగి బలపడతాయి.అవి తల్లిని విడిచిపోయి మరలా తిరిగి రావు.5“అడవి గాడిదను స్వేచ్ఛగా వెళ్లనిచ్చేది ఎవరు?దాని కట్లను విప్పింది ఎవరు?6బంజరు భూమిని దానికి ఇల్లుగాఉప్పు పర్రలను నివాస స్థలంగా ఇచ్చాను.7అది పట్టణంలోని సందడిని చూసి నవ్వుతుంది;తోలేవాని కేకలు అది వినదు.8దాని పచ్చిక కోసం అది పర్వతాల్లో తిరుగుతుంది,ఏదైన పచ్చని దాని కోసం వెదకుతుంది.9“నీకు సేవ చేయడానికి అడవి ఎద్దు అంగీకరిస్తుందా?రాత్రివేళ అది నీ పశువుల దొడ్డిలో ఉంటుందా?10నీవు అడవి ఎద్దుకు పగ్గం వేసి నాగటికి కట్టి నడిపించగలవా?నీ వెనుక నడుస్తూ అది లోయ భూములను దున్ని చదును చేస్తుందా?11దాని బలం గొప్పదని దాన్ని నమ్ముతావా?నీ పెద్ద పనిని దానికి అప్పగిస్తావా?12అది నీ ధాన్యాన్ని ఇంటికి మోసుకొనివచ్చి,అది నీ నూర్పిడి కళ్ళంలో కూర్చుతుందని నీవు నమ్మగలవా?13“నిప్పుకోడి రెక్కలు సంతోషంతో ఆడిస్తుంది,అయినా కొంగకున్న రెక్కలు ఈకలతోఅవి పోల్చబడకపోయినా.14అది నేలమీద గుడ్లు పెడుతుందిఇసుకలో వాటిని పొదుగుతుంది.15ఏ పాదమో వాటిని నలిపివేస్తుందని,ఏ అడవి జంతువో వాటిని త్రొక్కివేస్తుందని అది ఆలోచించదు.16తన పిల్లలు తనవి కానట్టు, వాటిని కఠినంగా చూస్తుంది;తన ప్రసవ వేదనంతా వృధా అయినా అది పట్టించుకోదు.17ఎందుకంటే దేవుడు దానికి జ్ఞానం ఇవ్వలేదుదానికి గ్రహింపు ఇవ్వలేదు.18అయినా పరుగెత్తడానికి అది తన రెక్కలను చాపినప్పుడు,అది గుర్రాన్ని దాని రౌతును చూసి నవ్వుతుంది.19“గుర్రానికి దాని బలాన్ని నీవిస్తావా?దాని మెడ మీద జూలు పెట్టింది నీవా?20దాని భీకరమైన గురకతో భయాన్ని సృష్టించే మిడతలా,మీరు దానిని దూకేలా చేస్తారా?21అది తన బలాన్నిబట్టి సంతోషిస్తూ, ఆగ్రహంతో నేలను దువ్వి,పోరాడటానికి పరుగెడుతుంది.22అది భయాన్ని చూసి నవ్వుతుంది, దేనికి భయపడదు;ఖడ్గాన్ని చూసినా వెనుతిరుగదు.23మెరుస్తున్న ఈటెలు బరిసెలతో పాటుదాని అంబులపొది గలగలలాడుతుంది,24పిచ్చి కోపంలో అది నేల మీద కాలు దువ్వుతుంది;బూరధ్వని విన్నప్పుడు అది ప్రశాంతంగా నిలబడలేదు.25బూర మ్రోగగానే అది, ‘ఆహా!’ అని అంటుందిదూరం నుండే యుద్ధవాసన,సేనాధిపతుల కేకలు యుద్ధఘోష పసిగడుతుంది.26“దక్షిణదిక్కు వైపుకు తన రెక్కలు చాపి ఎలా ఎగరాలోడేగకు నీ జ్ఞానంతో నేర్పించావా?27నీ ఆజ్ఞను బట్టే గ్రద్ద పైకెగిరిపోయి,తన గూడు ఎత్తైన చోటులో కట్టుకుంటుందా?28ఎవరు ఎక్కలేని కొండచరియలో నివసిస్తుంది రాత్రివేళ అక్కడే గడుపుతుంది;ఏటవాలుగా ఉన్న బండ దానికి బలమైన కోట.29అక్కడి నుండే ఆహారం కోసం చూస్తుంది;దాని కళ్లు దూరం నుండే దానిని కనిపెడతాయి.30దాని పిల్లలు రక్తాన్ని త్రాగుతాయి,మృతదేహాలు ఎక్కడ ఉంటాయో అక్కడే అది ఉంటుంది.”