యోబు35tel_otsa

1ఇంకా ఎలీహు అన్నాడు:2“ఇది న్యాయమని నీవనుకుంటున్నావా?‘నా నీతి దేవుని నీతి కన్నా గొప్పది.’3అయితే, నా పాపం వలన నాకు లాభమేంటి?‘పాపం చేయకపోవడం వలన నేను పొందేదేంటి?’అని నీవు అడుగుతున్నావు.
4“నేను నీ స్నేహితులకునీకు జవాబు చెప్పాలనుకుంటున్నాను.5ఆకాశం వైపు తేరి చూడండి;మీకన్నా ఎంతో ఎత్తుగా ఉన్న మేఘాల వైపు చూడండి.6నీవు పాపం చేస్తే, అది ఆయన మీద ఎలా ప్రభావం చూపుతుంది?నీ పాపాలు ఎక్కువగా ఉంటే, అది ఆయనకేమి చేస్తుంది?7నీవు నీతిమంతుడవైతే, నీవు ఆయనకేమి ఇస్తావు,నీ చేతి నుండి ఆయన ఏం పొందుకుంటారు?8నీ దుష్టత్వం నీలాంటి మనుష్యుల మీద,నీ నీతి ఇతరుల మీద మాత్రమే ప్రభావం చూపుతుంది.
9“ఒత్తిళ్ళ భారాన్ని బట్టి ప్రజలు ఆక్రందన చేస్తారు;బలవంతుల చేతి నుండి విడుదల కోసం విన్నవించుకొంటారు.10అయితే, ‘రాత్రివేళ పాటలు ఇచ్చే,భూజంతువుల కంటే మనకు ఎక్కువ బోధించే,ఆకాశపక్షుల కన్నా మనలను జ్ఞానవంతులుగా చేసే,నా సృష్టికర్తయైన దేవుడు ఎక్కడున్నాడు?’ అని ఎవరు అనరు.12దుర్మార్గుల గర్వం కారణంగాప్రజలు మొరపెట్టినా ఆయన జవాబివ్వరు.13నిజానికి, వారి ఖాళీ మనవిని దేవుడు వినరు;సర్వశక్తిమంతుడు వాటిని లెక్క చేయడు.14అయితే, మీరు అతన్ని చూడలేదని,మీ వాదన అతని ముందు ఉందని,మీరు అతని కోసం వేచి ఉండాలని,15ఇంకా ఎంత తక్కువ చెప్పినా అతడు వింటాడా? అతని కోపం ఎప్పుడూశిక్షించదు అతడు దుర్మార్గాన్ని కనీసం పట్టించుకోడు.16కాబట్టి యోబు వ్యర్థంగా మాట్లాడుతున్నాడు;తెలివి లేకుండా ఎన్నో మాటలు పలికాడు.”

No translations available.