యోబు16tel_otsa

యోబు

1అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:2నేను ఇలాంటి విషయాలెన్నో విన్నాను;మీరందరు నీచంగా ఓదార్చేవారు.3మీ గాలిమాటలకు అంతం లేదా?మీరు ఇలాంటి సమాధానం ఇచ్చేలా ఏది మిమ్మల్ని బలవంతం చేస్తుంది?4నేనున్న స్థానంలో మీరు ఉంటే,నేనూ మీలాగే మాట్లాడగలను;మీకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడిమిమ్మల్ని చూసి తల ఊపుతూ ఎగతాళి చేయగలను.5కాని నా నోటి మాట మిమ్మల్ని బలపరుస్తుంది;నా పెదవుల నుండి వచ్చే ఆదరణ మీకు ఉపశమనం కలిగిస్తుంది.
6అయితే నేను మాట్లాడినప్పటికి నా బాధకు ఉపశమనం లేదు;మౌనంగా ఉన్నా నా బాధ తీరదు.7దేవా, నాకు అలసట కలిగించారు;నా కుటుంబమంతటిని వినాశనం చేశారు.8మీరు నన్ను అస్థిపంజరంలా చేశారు అది నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది;బక్కచిక్కిన నా దేహం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది.9దేవుడు తన కోపంలో నా మీద దాడి చేసి నన్ను చీల్చివేశారు;ఆయన నా వైపు చూస్తూ పళ్ళు కొరుకుతున్నారు;నాకు శత్రువై నాపై కన్నెర్ర చేసి నావైపు కోపంగా చూస్తున్నారు.10ప్రజలు నన్ను ఎత్తిపొడవడానికి వారి నోళ్ళు తెరిచారు;నన్ను తిట్టి చెంపదెబ్బలు కొడుతున్నారు.నాకు వ్యతిరేకంగా వారంతా ఒక్కటైయ్యారు.11దేవుడు నన్ను భక్తిహీనులకు అప్పగించారు.దుర్మార్గుల చేతుల్లో నన్ను పడవేశారు.12నేను నెమ్మది కలిగి ఉండేవాన్ని, కాని ఆయన నన్ను ముక్కలుగా చేశారు;నా మెడ పట్టుకుని విదిలించి నన్ను నలిపేశారు.ఆయన నన్ను తన గురిగా పెట్టుకున్నారు;13ఆయన బాణాలు నన్ను చుట్టుకున్నాయిజాలి లేకుండ ఆయన నా మూత్రపిండాల గుండా గుచ్చారునా పైత్యరసాన్ని నేలపై పారబోశారు.14పదే పదే ఆయన నన్ను విరుచుకుపడ్డారు;శూరునిలా పరుగున నా మీద పడ్డారు.
15నా చర్మం మీద గోనెపట్ట కుట్టుకున్నానునా నుదిటిని దుమ్ములో ఉంచాను.16ఏడ్పుచేత నా ముఖం ఎరుపెక్కిందినా కనురెప్పల మీద చీకటి నీడలు ఉన్నాయి;17అయినా నా చేతులు దౌర్జన్యానికి దూరంగా ఉన్నాయి,నా ప్రార్థనలు యథార్థంగా ఉన్నాయి.
18భూమీ, నా రక్తాన్ని కప్పివేయకు;నా మొర ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలి.19ఇప్పుడు కూడా నా సాక్షి పరలోకంలో ఉన్నాడు;నా న్యాయవాది పైన ఉన్నాడు.20నా కళ్లు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుండగానా మధ్యవర్తి నా స్నేహితుడు21ఒకడు స్నేహితుని కోసం వేడుకున్నట్లుఅతడు నరుని పక్షాన దేవున్ని వేడుకుంటాడు.
22ముందున్నవి ఇంకా కొన్ని సంవత్సరాలేతర్వాత నేను తిరిగి రాలేని మార్గంలో వెళ్తాను.