1ఇశ్రాయేలు ప్రజలారా! యెహోవా మీతో మాట్లాడుతున్నారు, వినండి.2యెహోవా ఇలా చెప్తున్నారు:“ఇతర దేశాల విధానాలను నేర్చుకోవద్దుఆకాశంలో సూచనలను చూసి అవి భయపడినా,మీరు భయపడవద్దు.3ఎందుకంటే జనాంగాల ఆచారాలు విలువలేనివి;వారు అడవిలో చెట్టు నరికి తెస్తారు,హస్తకళాకారుడు ఉలితో చెక్కుతాడు.4వారు వెండి బంగారాలతో వాటిని అలంకరిస్తారు;కదలకుండా ఉండేలా,సుత్తితో మేకులు కొట్టి దానిని బిగిస్తారు.5దోసకాయ పొలంలో దిష్టిబొమ్మలా,వారి విగ్రహాలు మాట్లాడలేవు;అవి నడవలేవు కాబట్టివాటిని మోయాలి.వాటికి భయపడవద్దు;అవి ఏ హాని చేయలేవుఅలాగే ఏ మేలు కూడా చేయలేవు.”6యెహోవా, మీలాంటి వారు ఎవరు లేరు;మీరు గొప్పవారు,మీ నామం ఘనమైనది.7దేశాలకు మీరు రాజు,మిమ్మల్ని గౌరవించని వాడెవడు?గౌరవం మీకు చెందినదే.దేశాలకు చెందిన జ్ఞానులైన నాయకులందరిలోవారి రాజ్యాలన్నిటిలో,మీలాంటి వారెవ్వరూ లేరు.8వారంతా తెలివిలేనివారు, మూర్ఖులు;వారు పనికిరాని చెక్క విగ్రహాల బోధను వింటున్నారు.9తర్షీషు నుండి సాగగొట్టబడిన వెండిఊఫజు నుండి బంగారం తీసుకురాబడ్డాయి.హస్తకళాకారుడు, కంసాలివాడు తయారుచేసినవాటికి నీలం, ఊదా రంగుల వస్త్రాలు ధరింపచేశారు,అవన్నీ నైపుణ్యం కలిగిన పనివారిచేత తయారుచేయబడ్డాయి.10అయితే యెహోవాయే నిజమైన దేవుడు;ఆయన సజీవుడైన దేవుడు, నిత్య రాజు.ఆయనకు కోపం వచ్చినప్పుడు, భూమి కంపిస్తుంది;ఆయన ఉగ్రతను దేశాలు సహించలేవు.11“వారితో ఇలా చెప్పు: ‘ఆకాశాన్ని, భూమిని సృజించని ఈ దేవుళ్ళు భూమి మీద నుండి, ఆకాశం క్రిందనుండి నశించిపోతారు.’ ”12అయితే దేవుడు తన శక్తితో భూమిని చేశారు;ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు,తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.13ఆయన ఉరిమినప్పుడు ఆకాశ జలాలు గర్జిస్తాయి;ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు.ఆయన వర్షంతో మెరుపులు పంపితన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.14మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు;ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు.అతడు చేసే చిత్రాలు మోసం;వాటిలో ఊపిరి లేదు.15అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి;వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.16యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు,ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు,అన్నిటిని సృజించారు.ఆయన పేరు సైన్యాల యెహోవా.
రాబోతున్న నాశనం
17ఆక్రమణలో ఉంటున్నవారలారా,దేశాన్ని విడిచి వెళ్లడానికి మీ వస్తువులను సర్దుకోండి.18ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు:“ఈ సమయంలో నేనుఈ దేశంలో నివసించేవారిని తరిమివేస్తాను.వారు పట్టబడేలానేను వారి మీదికి కష్టం రప్పిస్తాను.”19నా గాయం వల్ల నాకు శ్రమ!నా గాయం మానిపోయేది కాదు!అయినా, “ఇది నా జబ్బు, నేను భరించాలి”అని నాలో నేను చెప్పుకున్నాను.20నా గుడారం నాశనమైంది;దాని త్రాళ్లన్నీ తెగిపోయాయి.నా పిల్లలు నా నుండి వెళ్లిపోయారు, వారిక లేరు;నా గుడారం వేయడానికినాకు బసను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఎవరూ లేరు.21కాపరులు తెలివిలేనివారువారు యెహోవా దగ్గర విచారణ చేయరు;కాబట్టి వారు వర్ధిల్లరువారి మంద అంతా చెదరిపోయింది.22వినండి! నివేదిక వస్తుందిఉత్తర దేశం నుండి ఒక గొప్ప కలకలం!అది యూదా పట్టణాలను నిర్జనంగా,నక్కల విహారంగా చేస్తుంది.
యిర్మీయా ప్రార్థన
23యెహోవా, మనుష్యుల ప్రాణాలు వారివి కాదని నాకు తెలుసు;తమ అడుగులు నిర్దేశించుకోవడం వారికి చేతకాదు.24యెహోవా, నన్ను క్రమశిక్షణలో పెట్టు, కానీ న్యాయమైన కొలతతో మాత్రమేమీ కోపంలో కాదు,లేకపోతే మీరు నన్ను పూర్తిగా నాశనం చేస్తారు.25మిమ్మల్ని గుర్తించనిదేశాల మీద,మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి.వారు యాకోబును మ్రింగివేశారు;వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారుఅతని మాతృభూమిని నాశనం చేశారు.