యెషయా64tel_otsa

1మీరు ఆకాశాన్ని చీల్చివేసి దిగివస్తే,పర్వతాలు మీ ఎదుట వణుకుతాయి!2మంట ఎండుకొమ్మల్ని కాల్చినప్పుడు,ఆ మంటకు నీళ్లు మరిగినట్లు,మీ శత్రువులకు మీ పేరు తెలిసేలా మీరు దిగిరండి,మీ ఎదుట దేశాలు వణికేలా చేయండి!3మేము ఊహించని భయంకరమైన పనులు మీరు చేసినప్పుడుమీరు దిగివచ్చారు, పర్వతాలు మీ ఎదుట వణికాయి.4తన కోసం ఎదురు చూసే వారి పక్షంగా కార్యం చేసే మిమ్మల్ని తప్పఅనాది కాలం నుండి ఏ దేవున్ని ఎవరూ చూడలేదుఅలాంటి దేవుడు ఉన్నాడని ఎవరూ వినలేదుఎవరూ గ్రహించలేదు.5మీ మార్గాలను గుర్తుచేసుకుంటూసంతోషంగా సరియైనది చేసేవారికి సహాయం చేయడానికి మీరు వస్తారు.అయితే మేము వాటికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నప్పుడుమీరు కోప్పడ్డారు.అలా అయితే మేము ఎలా రక్షింపబడగలం?6మేమందరం అపవిత్రులమయ్యాము,మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డలుగా ఉన్నాయి;మేమందరం ఆకులా వాడిపోయాము,గాలిలా మా పాపాలు మమ్మల్ని తుడిచివేస్తున్నాయి.7ఎవరూ మీ పేరిట మొరపెట్టడం లేదుమిమ్మల్ని ఆధారం చేసుకోవడానికి ఆరాటపడడం లేదు.మీరు మా నుండి మీ ముఖం దాచుకున్నారు.మమ్మల్ని మా పాపాలకు అప్పగించారు.
8అయినా యెహోవా! మీరే మాకు తండ్రి.మేము మట్టి, మీరు కుమ్మరి.మేమందరం మీ చేతి పనిగా ఉన్నాము.9యెహోవా! ఎక్కువగా కోప్పడకండి;నిత్యం మా పాపాల్ని జ్ఞాపకం చేసుకోకండి.మేమంతా మీ ప్రజలమే కాబట్టిమా పట్ల దయ చూపించమని ప్రార్థిస్తున్నాము.10మీ పరిశుద్ధ పట్టణాలు బంజరు భూమిగా మారాయి;చివరకు సీయోను బంజరు భూమిగా, యెరూషలేము నిర్జనంగా మారాయి.11మా పూర్వికులు మిమ్మల్ని స్తుతించిన సుందరమైన మా కీర్తిగల మందిరంఅగ్నితో కాల్చబడింది,మా ఆహ్లాదకరమైనవన్నీ నాశనమైపోయాయి.12యెహోవా! ఇదంతా జరిగిన తర్వాత, మీరు చూసి ఊరుకుంటారా?మీరు మౌనంగా ఉండి మమ్మల్ని ఇంకా శిక్షిస్తూనే ఉంటారా?