1రక్తపు మరకలు కలిగిన బట్టలు వేసుకుని ఎదోము నుండిబొస్రానుండి వస్తున్న ఇతడెవరు?రాజ వస్త్రాలను ధరించి గంభీరంగా నడుస్తూగొప్ప బలంతో వస్తున్న ఇతడెవరు?“విజయాన్ని ప్రకటిస్తూరక్షించగల సమర్థుడనైన నేనే.”2నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కేవాని బట్టల్లాఎర్రగా ఎందుకు ఉన్నాయి?3“నేను ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కాను;దేశాల్లో ఏ ఒక్కరూ నాతో లేరు.నా కోపంలో వారిని త్రొక్కివేశానునా ఉగ్రతలో వారిని అణగద్రొక్కాను;వారి రక్తం నా బట్టలమీద చిందింది,నా బట్టలన్నిటికి మరకలయ్యాయి.4అది నేను పగతీర్చుకునే రోజు;నేను విమోచించే సంవత్సరం వచ్చింది.5నేను చూశాను కాని సహాయం చేయడానికి ఎవరూ లేరు;ఎవరూ సహకారం అందించకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను;కాబట్టి నా సొంత చేయి నాకు రక్షణ ఇచ్చిందినా కోపమే నన్ను ఆదుకుంది.6నేను నా కోపంతో దేశాలను త్రొక్కివేశానునా ఉగ్రతలో వారు మత్తెక్కేలా చేశానువారి రక్తాన్ని నేలమీద పారబోశాను.”
స్తుతి, ప్రార్థన
7యెహోవా మనకు చేసినదంతటిని బట్టి,యెహోవా కృపలను,యెహోవా స్తుతులను నేను ప్రకటిస్తాను.అవును, ఆయన తన కనికరాన్ని బట్టి, గొప్ప దయను బట్టిఇశ్రాయేలుకు ఆయన చేసిన అనేక మేలుల గురించినేను చెప్తాను.8ఆయన అన్నారు, “నిజంగా వారు నా ప్రజలు,నాకు నమ్మకంగా ఉండే పిల్లలు”;కాబట్టి ఆయన వారికి రక్షకుడయ్యారు.9వారి బాధంతటిలో ఆయన కూడా బాధ అనుభవించారు,ఆయన సన్నిధి యొక్క దూత వారిని రక్షించాడు.ఆయన ప్రేమతో, జాలితో వారిని విడిపించారు;పూర్వ రోజులన్నిటిలోఆయన వారిని ఎత్తుకుంటూ, మోస్తూ వచ్చారు.10అయినా వారు తిరుగుబాటు చేసిఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు.కాబట్టి ఆయన వారికి శత్రువయ్యారుతానే వారితో యుద్ధం చేశారు.11అప్పుడు ఆయన ప్రజలు పూర్వ రోజులను,మోషేను తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నారుతన మందకాపరులతో పాటుతమను సముద్రంలో నుండి తీసుకువచ్చిన ఆయనేరి?తమలో తన పరిశుద్ధాత్మనుఉంచిన ఆయనేరి?12మోషే కుడిచేతి వైపుమహిమగల తన చేతిని పంపిన ఆయనేరి?తనకు శాశ్వతమైన కీర్తి రాడానికివారి ఎదుట నీళ్లను విభజించిన ఆయనేరి?13మైదానంలో గుర్రం నడిచినట్లువారు పడిపోకుండాలోతైన జలాల్లో నడిపించిన ఆయనేరి?14లోయలోనికి దిగివెళ్లే పశువుల్లాయెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసింది.మీకు ఘనమైన పేరు రావాలనిమీరు మీ ప్రజలను ఇలా నడిపించారు.15పరలోకం నుండి,గంభీరమైన, పరిశుద్ధమైన మహిమగల సింహాసనం నుండి క్రిందికి చూడండి.మీ ఆసక్తి మీ బలము ఏవి?మా పట్ల మీకున్న జాలి కనికరం మా నుండి నిలిపివేయబడ్డాయి.16అయితే అబ్రాహాముకు మేము తెలియకపోయినాఇశ్రాయేలు మమ్మల్ని గుర్తించకపోయినామాకు తండ్రి మీరే;యెహోవా! మాకు తండ్రి మీరే,పూర్వకాలం నుండి మా విమోచకుడవని మీకు పేరు.17యెహోవా! మేము మీ మార్గాల నుండి తొలగిపోయి తిరిగేలా ఎందుకు చేశారు?మిమ్మల్ని భయపడకుండా మా హృదయాల్ని ఎందుకు కఠినపరిచారు?మీ సేవకుల కోసం,మీ స్వాస్థ్యమైన గోత్రాల కోసం తిరిగి రండి.18మీ ప్రజలు కొద్ది కాలమే మీ పరిశుద్ధ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారుకాని ఇప్పుడు మా శత్రువులు మీ పరిశుద్ధాలయాన్ని త్రొక్కివేశారు.19పూర్వం నుండి మేము మీ వారము;కాని మీరెన్నడు వారిని పాలించలేదు,వారు మీ పేరుతో పిలువబడలేదు.