యెషయా35tel_otsa

విమోచన పొందినవారి ఆనందం

1ఎడారి, ఎండిన భూమి సంతోషిస్తాయి;అరణ్యం సంతోషించి పూస్తుంది.అది కుంకుమ పువ్వులా,2ఒక్కసారిగా విచ్చుకుంటుంది;అది గొప్పగా సంతోషించి ఆనందంతో కేకలు వేస్తుంది.లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది,కర్మెలు షారోనుల వైభవం దానికి ఉంటుంది;వారు యెహోవా మహిమనుమన దేవుని వైభవాన్ని చూస్తారు.
3బలహీనమైన చేతులను బలపరచండి,వణుకుతున్న మోకాళ్లను స్థిరపరచండి;4భయపడేవారితో ఇలా అనండి:“ధైర్యంగా ఉండండి, భయపడకండి;మీ దేవుడు వస్తారుఆయన ప్రతీకారంతో వస్తారు.దైవిక ప్రతీకారంతోఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.”
5అప్పుడు గ్రుడ్డివారి కళ్లు తెరవబడతాయిచెవిటి వారి చెవులు వినబడతాయి.6అప్పుడు కుంటివారు జింకలా గంతులు వేస్తారు,మూగవాని నాలుక ఆనందంతో కేకలు వేస్తుంది.అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయిఎడారిలో కాలువలు పారతాయి.7మండుతున్న ఇసుక చెరువులా మారుతుందిఎండిన నేలలో నీటిబుగ్గలు పుడతాయి.ఒక్కప్పుడు తోడేళ్లు పడుకున్న స్థలంలోగడ్డి, రెల్లు, జమ్ము పెరుగుతాయి.
8అక్కడ రహదారి ఉంటుంది;అది పరిశుద్ధ మార్గమని పిలువబడుతుంది;అది ఆ మార్గంలో నడిచే వారికి మాత్రమే.అపవిత్రులు ఆ దారిలో వెళ్లకూడదు;దుర్మార్గమైన మూర్ఖులు దానిలో నడవరు.9అక్కడ ఏ సింహం ఉండదు,ఏ క్రూర జంతువు ఉండదు;అవి అక్కడ కనబడవు.విమోచన పొందిన వారే అక్కడ నడుస్తారు.10యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు.వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు;నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది.వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు.దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.