1ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లెక్కచేయకుండాయెహోవా నుండి సహాయం కోసం చూడకుండసహయం కోసం ఈజిప్టుకు వెళ్లే వారికిగుర్రాలపై ఆధారపడేవారికి,తమ రథాల సంఖ్యపైగుర్రపురౌతుల గొప్ప బలం మీద నమ్మకం ఉంచే వారికి శ్రమ.2అయినా ఆయన చాలా తెలివైనవారు, వినాశనం తీసుకురాగలరు;ఆయన తన మాట వెనుకకు తీసుకోరు.ఆయన దుష్టప్రజల మీద,కీడు చేసేవారికి సహయపడేవారి మీద లేస్తారు.3ఈజిప్టువారు కేవలం మనుష్యులే, దేవుడు కాదు;వారి గుర్రాలు మాంసమే కాని ఆత్మ కాదు.యెహోవా తన చేయి చాపగాసహయం చేసేవారు తడబడతారు,సహయం పొందేవారు పడతారు;వారందరు కలిసి నాశనమవుతారు.4యెహోవా నాతో చెప్పే మాట ఇదే:తప్పించడానికి గొర్రెల కాపరులందరు కలిసివచ్చిఎన్ని శబ్దాలు చేసినా భయపడకుండావారి కేకలకు కలవరపడకుండాసింహం ఒక కొదమసింహంతనకు దొరికిన దాని మీద గర్జించినట్లుసైన్యాల యెహోవాయుద్ధం చేయడానికి సీయోను పర్వతం మీదికిదాని కొండ మీదికి దిగి వస్తారు.5అటూ ఇటూ ఎగిరే పక్షుల్లాసైన్యాల యెహోవా యెరూషలేమును కాపాడతారు;ఆయన దానిని కాపాడుతూ విడిపిస్తారు.దాని మీద దాటి వెళ్తూ దానిని రక్షిస్తారు.6ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరిపై తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి.7మీ పాపిష్ఠి చేతులు తయారుచేసిన వెండి బంగారు విగ్రహాలను ఆ రోజున మీలో ప్రతి ఒక్కరు పారవేస్తారు.8“మనుష్యులు చేయని ఖడ్గానికి అష్షూరు పడిపోతుంది.మానవులు చేయని ఖడ్గం వారిని మ్రింగివేస్తుంది.వారు ఖడ్గం ఎదుట నుండి పారిపోతారువారి యవ్వనస్థులు వెట్టిచాకిరి చేస్తారు.9వారి ఆశ్రయ కోట భయంతో పడిపోతుంది;వారి అధిపతులు యుద్ధ జెండా చూసి భయపడిపోతారు”అని యెహోవా ప్రకటించారు.సీయోనులో ఆయన అగ్నియెరూషలేములో ఆయన కొలిమి ఉన్నాయి.