యెషయా27tel_otsa

ఇశ్రాయేలు విడుదల

1ఆ రోజునయెహోవా భయంకరమైన, గొప్పదైనశక్తిగల తన ఖడ్గంతోలెవియాథన్ అనే ఎగిరే పాము,లెవియాథన్ అనే చుట్టుకునే పామును ఆయన శిక్షిస్తారు.ఆయన సముద్రపు మృగాన్ని చంపుతారు.2ఆ రోజున“ఫలభరితమైన ద్రాక్షతోట గురించి పాడండి:3యెహోవానైన నేను దానిని కాపాడతాను;నేను దానికి క్రమంగా నీరు పెడతాను.ఎవరూ దానిని పాడు చేయకుండరాత్రి పగలు కాపలా కాస్తాను.4నాకు కోపం లేదు.ఒకవేళ గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటేయుద్ధం చేయడానికి వాటికి ఎదురు వెళ్తానువాటన్నిటిని కాల్చివేస్తాను.5ఆశ్రయం కోసం వారు నా దగ్గరకు రానివ్వండి;వారు నాతో సమాధానపడాలి,అవును, వారు నాతో సమాధానపడాలి.”
6రాబోయే రోజుల్లో యాకోబు వేరు పారుతుంది,ఇశ్రాయేలు చిగురించి వికసించిలోకమంతటిని ఫలంతో నింపుతుంది.
7ఇశ్రాయేలును కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు,యెహోవా ఇశ్రాయేలును కొట్టారా?ఇశ్రాయేలును చంపినవారిని ఆయన చంపినట్లుఇశ్రాయేలును చంపరా?8మీరు యుద్ధంతో వెళ్లగొట్టి దానిని శిక్షించారుతూర్పు నుండి బలమైన గాలి వీచినట్లుఆయన తన బలమైన గాలితో దానిని తరిమికొట్టారు.9ఈ విధంగా యాకోబు అపరాధం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది,ఇదంతా అతని పాప పరిహారానికి కలిగే సంపూర్ణ ఫలం ఇదే:సున్నపురాయిని ముక్కలుగా నలగ్గొట్టినట్లు,అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని చేసినప్పుడుఅషేరా స్తంభాలు కాని ధూప బలిపీఠాలు కానిమిగిలి ఉండవు.10బలమైన పట్టణం ఒంటరిగా నిలిచిపోతుంది,పాడుబడిన స్థలంగా మారి అరణ్యంలా విడిపెట్టబడుతుంది.అక్కడ దూడలు మేస్తాయిఅక్కడే అవి పడుకుంటాయి;అవి దాని చెట్ల కొమ్మలు తినివేస్తాయి.11దాని కొమ్మలు ఎండి విరిగిపోతాయిస్త్రీలు వచ్చి వాటితో మంట పెడతారు.ఎందుకంటే, ఈ ప్రజలు వివేచన లేనివారు;కాబట్టి వారిని రూపించినవాడు వారిపై జాలిపడరు.వారి సృష్టికర్త వారికి దయ చూపించరు.12ఆ రోజున యెహోవా పారుతున్న యూఫ్రటీసు నది నుండి ఈజిప్టు వాగువరకు నూర్చుతారు. ఓ ఇశ్రాయేలూ! నీవు ఒక్కొక్కరిగా సమకూర్చబడతావు.13ఆ రోజున ఓ గొప్ప బూరధ్వని వినబడుతుంది. అష్షూరులో నశిస్తున్నవారు ఈజిప్టులో చెరపట్టబడినవారు వచ్చి యెరూషలేములోని పరిశుద్ధ పర్వతం మీద యెహోవాను ఆరాధిస్తారు.