1యెహోవా, మీరే నా దేవుడు;నేను మిమ్మల్ని ఘనపరచి మీ నామాన్ని స్తుతిస్తాను,పరిపూర్ణ నమ్మకత్వంతోమీరు ఎంతో కాలం క్రితం ఆలోచించినఅద్భుతాలను మీరు చేశారు.2మీరు పట్టణాన్ని శిథిలాల కుప్పగాకోట ఉన్న పట్టణాన్ని పాడైన దానిగా,విదేశీయుల దుర్గాన్ని పట్టణంగా ఉండకుండా చేశారు;అది ఎప్పటికీ తిరిగి కట్టబడదు.3కాబట్టి బలమైన జనాంగాలు మిమ్మల్ని గౌరవిస్తారు;క్రూరమైన దేశాల పట్టణాలు మీకు భయపడతాయి.4మీరు పేదవారికి ఆశ్రయంగా ఉన్నారు,అవసరతలో ఉన్నవారికి తమ బాధలో మీరు ఆశ్రయంగా ఉన్నారు,తుఫానులో ఉన్నవారికి ఆశ్రయంగా,వేడి నుండి తప్పించే నీడగా ఉన్నారు.ఎందుకంటే, క్రూరుల శ్వాసగోడకు తాకే తుఫానులా,5ఎడారి వేడిలా ఉంటుంది.మీరు విదేశీయుల ప్రగల్భాలను అణచివేశారు;మేఘాల నీడ ద్వారా వేడి తగ్గునట్లుక్రూరుల పాట నిలిపివేయబడుతుంది.6ఈ పర్వతం మీద సైన్యాల యెహోవాప్రజలందరి కోసం క్రొవ్విన వాటిలో విందు సిద్ధం చేస్తారుఈ విందులో పాత ద్రాక్షరసం ఉంటుందిలేత మాంసం, ఎంపిక చేసిన ద్రాక్షరసం ఉంటాయి.7ఈ పర్వతంపై ఆయనప్రజలందరి ముఖాల మీద ఉన్న ముసుగునుసమస్త దేశాల మీద ఉన్న తెరను తీసివేస్తారు;8శాశ్వతంగా ఆయన మరణాన్ని మ్రింగివేస్తారు.ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీదికన్నీటిని తుడిచివేస్తారు;సమస్త భూమి మీద నుండితన ప్రజల అవమానాన్ని తొలగిస్తారు.యెహోవా ఇది తెలియజేశారు.9ఆ రోజున వారు ఇలా అంటారు,“నిజంగా ఈయనే మన దేవుడుఈయనను మనం నమ్ముకున్నాం, ఈయన మనల్ని రక్షించారు.మనం నమ్మిన యెహోవా ఈయనే;ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆనందిద్దాము.”10యెహోవా చేయి ఈ పర్వతంపై నిలిచి ఉంటుంది;అయితే పెంటకుప్పలో గడ్డిని త్రొక్కినట్లు,మోయాబీయులు తమ దేశంలోనే త్రొక్కబడతారు.11ఈతగాళ్లు ఈదడానికి తమ చేతులు చాపినట్లువారు దాని మధ్య తమ చేతులు చాపుతారు.వారి చేతులు యుక్తితో ఉన్నాదేవుడు వారి గర్వాన్ని అణచివేస్తారు.12మోయాబూ, నీ ఎత్తైన కోటలనుఆయన పడగొడతారు.వాటిని నేలకు అణగద్రొక్కిధూళిలో పడవేస్తారు.