యెషయా18tel_otsa

కూషుకు వ్యతిరేకంగా ప్రవచనం

1కూషు నదుల అవతలసందడి చేసే రెక్కల దేశమా , నీకు శ్రమ!2అది సముద్ర మార్గంలో నీటి మీదజమ్ము పడవలలో దూతలను పంపుతుంది.తొందరపడే దూతలారా!వారు నునుపైన చర్మం గల ఎత్తైన ప్రజల దగ్గరకు,దూరంలోనున్న భయపెట్టే ప్రజల దగ్గరకు,నదులు పారుచున్న దేశం కలిగిదౌర్జన్యం వింత భాష కలిగిన దేశం దగ్గరకు వెళ్లండి.
3సమస్త లోకవాసులారా,భూలోక నివాసులారా,పర్వతాలమీద ఒక జెండాను ఎత్తినప్పుడుమీరు చూస్తారు,బూర ఊదినప్పుడుమీరు వింటారు.4యెహోవా నాతో చెప్పే మాట ఇది:“సూర్యకాంతిలోని తీవ్రమైన వేడిలా,వేసవి కోతకాలంలోని పొగమంచు మేఘంలా,నేను నిశ్శబ్దంగా నా నివాసస్థలం నుండి చూస్తాను.”5కోతకాలం రాకముందే, పువ్వు వాడిపోయినప్పుడుపువ్వు ద్రాక్షగా మారుతున్నప్పుడుఆయన మడ్డికత్తులతో ద్రాక్షతీగెలను కత్తిరించివిస్తరించే తీగెలను తీసివేస్తారు.6అవి పర్వత పక్షులకు,భూమిమీది మృగాలకు విడిచిపెట్టబడతాయి;వాటిని వేసవి కాలమంతా పక్షులు,శీతాకాలమంతా భూమిమీది మృగాలు తింటాయి.7ఆ కాలంలోఎత్తైన వారు నునుపైన చర్మం గల ప్రజలుదూరంలోనున్న భయపెట్టే ప్రజలునదులు పారుచున్న దేశం కలిగిదౌర్జన్యం చేసి వింత భాష కలిగిన దేశంసైన్యాల యెహోవాకు కానుకలు తెస్తారు. సైన్యాల యెహోవా నామానికి నివాసస్థలమైన సీయోను పర్వతానికి ఆ కానుకలు తీసుకువస్తారు.