1ఆ రోజున మీరు ఇలా అంటారు:“యెహోవా, నేను మిమ్మల్ని స్తుతిస్తాను.మీరు నాపై కోప్పడినా కూడామీ కోపం చల్లారిందిమీరు నన్ను ఆదరించారు.2నిజంగా దేవుడే నా రక్షణ;నేను భయపడను ఆయనను నమ్ముతాను.యెహోవా యెహోవాయే నా బలం, నా ఆత్మరక్షణ;ఆయనే నా రక్షణ అయ్యారు.”3మీరు రక్షణ బావులలో నుండిఆనందంతో నీళ్లు చేదుతారు.4ఆ రోజున మీరు ఇలా అంటారు:“యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి;దేశాల్లో ఆయన చేసిన కార్యాలను తెలియజేయండి,ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి.5యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన మహిమగల కార్యాలు చేశారు;లోకమంతటికి ఇది తెలియాలి.6సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి,ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”