యెషయా10tel_otsa
1అన్యాయపు చట్టాలు చేసేవారికి,చెడు శాసనాలు చేసేవారికి శ్రమ.2వారు పేదల హక్కులను హరిస్తారు,నా ప్రజల్లో అణచివేయబడిన వారికి న్యాయం చేరనివ్వరువారు విధవరాండ్రను తమ దోపుడు సొమ్ముగా చేసుకుంటూతండ్రిలేనివారిని దోచుకుంటారు.3తీర్పు తీర్చే రోజున,దూరం నుండి విపత్తు వచ్చినప్పుడు మీరేమి చేస్తారు?సహాయం కోసం ఎవరి దగ్గరకు పరుగెత్తుతారు?మీ సంపదను ఎక్కడ వదిలివేస్తారు?4బంధించబడిన వారి మధ్య మోకరిల్లడంచనిపోయినవారి మధ్య పడిపోవడం తప్ప మరేమీ మిగలదు.ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదుఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.