1“ఇశ్రాయేలు శిశువుగా ఉన్నప్పుడు నేను అతన్ని ప్రేమించాను,ఈజిప్టులో నుండి నేను నా కుమారుని పిలిచాను.2అయితే ఎంత ఎక్కువగా వారిని పిలిస్తే,అంతగా వారు నా నుండి దూరమయ్యారు.వారు బయలుకు బలులు అర్పించారు,విగ్రహాలకు ధూపం వేశారు.3ఎఫ్రాయిం ప్రజలను చేయి పట్టుకుని,నడవడం నేర్పింది నేనే;అయితే వారిని స్వస్థపరచింది నేననివారు గ్రహించలేదు.4నేను మనుష్యుల మంచితనం అనే త్రాళ్లతో,ప్రేమ బంధాలతో వారిని నడిపించాను.ఒకడు చిన్నబిడ్డను ముఖం దగ్గరకు ఎలా తీసుకుంటారో,అలా నేను వారికి ఉంటూ వారి మీద నుండి కాడిని తీసివేశాను,నేను క్రిందికి వంగి వారిని పోషించాను.5“వారు ఈజిప్టుకు తిరిగి వెళ్లరా?అష్షూరు రాజు వారిమీద అధికారం చేయడా?ఎందుకంటే వారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు.6వారి పట్టణాల్లో ఖడ్గం తళుక్కుమంటుంది;అది వారి అబద్ధ ప్రవక్తలను మ్రింగివేస్తుంది,వారి ఉపాయాలను తుదముట్టిస్తుంది.7నా ప్రజలు నా నుండి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నారు.వారు మహోన్నత దేవుడనైన నాకు మొరపెట్టినా,నేను ఏ విధంగాను వారిని హెచ్చించను.8“ఎఫ్రాయిమూ, నిన్ను ఎలా వదిలేయగలను?ఇశ్రాయేలూ, నిన్ను ఎలా అప్పగించగలను?నిన్ను ఎలా అద్మాలా పరిగణించగలను?సెబోయిములా నిన్ను ఎలా చేయగలను?నా హృదయం నాలో మారింది;నా జాలి అంతా ఉప్పొంగుతుంది.9నేను నా కోపాగ్నిని చూపించను,ఎఫ్రాయిమును మరలా నాశనం చేయను.నేను దేవుడను, మనిషిని కాను,మీ మధ్య ఉన్న పరిశుద్ధ దేవుడను.నేను వారి పట్టణాలకు విరుద్ధంగా రాను.10వారు యెహోవాను అనుసరిస్తారు;ఆయన సింహంలా గర్జిస్తారు,ఆయన గర్జించినప్పుడు,ఆయన పిల్లలు పడమటి నుండి వణకుతూ వస్తారు.11వారు వణకుతూ ఈజిప్టు నుండిపక్షుల్లా ఎగిరి వస్తారు,అష్షూరు నుండి గువ్వల్లా అల్లాడుతూ వస్తారు.వారిని తమ ఇళ్ళలో నివసించేలా చేస్తాను,”అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ఇశ్రాయేలీయుల పాపం
12ఎఫ్రాయిం అబద్ధాలతో నన్ను చుట్టుముట్టింది,ఇశ్రాయేలు మోసంతో నన్ను ఆవరించింది.యూదా దేవునికి విరుద్ధంగా ఉంది,నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు.