ఎజ్రా2tel_otsa

చెర నుండి తిరిగి వచ్చినవారి జాబితా

1బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు చెరగా తీసుకెళ్లిన వారు, చెరలో నుండి యెరూషలేముకు, యూదా దేశానికి తమ తమ పట్టణాలకు తిరిగి వెళ్లడానికి,2జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరే, బిగ్వయి, రెహూము, బయనా అనేవారితో పాటు వెళ్లినవారు వీరు:
ఇశ్రాయేలు ప్రజల పురుషుల జాబితా:
3పరోషు వారసులు 2,172;4షెఫట్యా వారసులు 372;5ఆరహు వారసులు 775;6పహత్-మోయాబు వారసులు (యెషూవ యోవాబు వారసులతో కలిపి) 2,812;7ఏలాము వారసులు 1,254;8జత్తూ వారసులు 945;9జక్కయి వారసులు 760;10బానీ వారసులు 642;11బేబై వారసులు 623;12అజ్గాదు వారసులు 1,222;13అదోనీకాము వారసులు 666;14బిగ్వయి వారసులు 2,056;15ఆదీను వారసులు 454;16అటేరు వారసులు (హిజ్కియా ద్వారా) 98;17బేజయి వారసులు 323;18యోరా వారసులు 112;19హాషుము వారసులు 223;20గిబ్బారు వారసులు 95;21బేత్లెహేము వారసులు 123;22నెటోపా వారసులు 56;23అనాతోతు వారసులు 128;24అజ్మావెతు వారసులు 42;25కిర్యత్-యారీము, కెఫీరా, బెయేరోతు వారసులు 743;26రామా, గెబా వారసులు 621;27మిక్మషు వారసులు 122;28బేతేలు, హాయి వారసులు 223;29నెబో వారసులు 52;30మగ్బీషు వారసులు 156;31మరొక ఏలాము వారసులు 1,254;32హారీము వారసులు 320;33లోదు, హదీదు, ఓనో వారసులు 725;34యెరికో వారసులు 345;35సెనాయా వారసులు 3,630.
36యాజకులు: యెషూవ కుటుంబీకుడైన యెదాయా వారసులు 973;37ఇమ్మేరు వారసులు 1,052;38పషూరు వారసులు 1,247;39హారీము వారసులు 1,017.
40లేవీయులు: యెషూవ కద్మీయేలు వారసులు (హోదవ్యా కుటుంబం నుండి) 74.
41సంగీతకారులు: ఆసాపు వారసులు 128.
42ఆలయ ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వారసులు 139.
43ఆలయ సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయోతు వారసులు,44కేరోసు, సీయహా, పాదోను వారసులు,45లెబానా, హగాబా, అక్కూబు వారసులు,46హాగాబు, షల్మయి, హానాను వారసులు,47గిద్దేలు, గహరు, రెవాయా వారసులు,48రెజీను, నెకోదా, గజ్జాము వారసులు,49ఉజ్జా, పాసెయ, బేసాయి వారసులు,50అస్నా, మెహూనీము, నెఫూసీము వారసులు,51బక్బూకు, హకూపా, హర్హూరు వారసులు,52బజ్లూతు, మెహీదా, హర్షా వారసులు,53బర్కోసు, సీసెరా, తెమహు వారసులు,54నెజీయహు, హటీపా వారసులు.55సొలొమోను సేవకుల వారసులు: సొటయి, హస్సోఫెరెతు, పెరూదా వారసులు,56యహలా, దర్కోను, గిద్దేలు వారసులు,57షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, అమీ వారసులు.58ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392.
59తేల్ మెలహు, తేల్ హర్షా, కెరూబు, అద్దోను, ఇమ్మేరు అనే పట్టణాల నుండి కొందరు వచ్చారు. అయితే వీరు తమ కుటుంబాలు ఇశ్రాయేలు నుండి వచ్చినట్లు రుజువు చూపలేకపోయారు:60దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు, మొత్తం 652.
61యాజకుల వారసులు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వారసులు (ఇతడు గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకుని ఆ పేరుతో పిలువబడ్డాడు).62వీరు వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు.63ఊరీము, తుమ్మీము ధరించే యాజకుని నియామకం జరిగే వరకు వారు అతిపరిశుద్ధమైన దేన్ని తినకూడదని అధిపతి వారిని ఆదేశించాడు.
64సమూహం మొత్తం సంఖ్య 42,360,65వీరు కాకుండా వీరి దాసదాసీలు 7,337; గాయనీ గాయకులు 200 మంది.66వారికి 736 గుర్రాలు, 245 కంచరగాడిదలు,67435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి.
68వారు యెరూషలేములో యెహోవా ఆలయానికి చేరుకున్నప్పుడు, కుటుంబ పెద్దలలో కొందరు ఆ స్థలంలో దేవుని మందిరాన్ని పునర్నిర్మించడానికి స్వేచ్ఛార్పణలు ఇచ్చారు.69వారు ఈ పని కోసం తమ శక్తి కొద్ది 61,000 డారిక్కులబంగారం, 5,000మీనాల వెండిని, యాజకులకు 100 వస్త్రాలను ఇచ్చారు.70యాజకులు, లేవీయులు, సంగీతకారులు, ద్వారపాలకులు, ఆలయ సేవకులు, తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఇతర ప్రజల్లో కొంతమంది మిగిలిన ఇశ్రాయేలీయులతో పాటు తమ పట్టణాల్లో స్థిరపడ్డారు.