1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:2“మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలీయుల దేశానికి చెప్తున్న మాట ఇదే:“ ‘అంతం! అంతం వచ్చేసిందిదేశం నలువైపులా వచ్చేసింది!3ఇప్పుడు నీ మీద అంతం వచ్చేసింది!నా కోపాన్ని నీపై కుమ్మరిస్తాను.నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చినీ అసహ్యకరమైన ఆచారాలన్నిటిని బట్టి నీకు తిరిగి చెల్లిస్తాను.4నీ మీద ఏమాత్రం దయ చూపించనునిన్ను వదిలిపెట్టను.నీ ప్రవర్తనకు నీ మధ్య ఉన్నఅసహ్యకరమైన ఆచారాలన్నిటికి నీకు ప్రతిఫలమిస్తాను.“ ‘నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’5“ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే:“ ‘విపత్తు! విపత్తు వెనకే విపత్తుచూడండి, అది వచ్చేస్తుంది!6అంతం వచ్చేసింది!అంతం వచ్చేసింది!అది నీ కోసమే చూస్తుంది;ఇదిగో, వచ్చింది.7దేశ నివాసులారా!మీ మీదికి వినాశనం వస్తుంది.సమయం దగ్గరకి వచ్చింది! ఆ రోజు సమీపంగా ఉంది!ఆనందం కాదు భయమే పర్వతాలమీద వినపడుతుంది.8నా ఉగ్రత మీపై కుమ్మరించబోతున్నాను.నా కోపాన్ని మీమీద చూపిస్తాను.మీ ప్రవర్తనకు మీరు చేసినఅసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను.9మీమీద ఏమాత్రం దయ చూపించను;మిమ్మల్ని వదిలిపెట్టను.మీ ప్రవర్తనకు, మీ మధ్య ఉన్నఅసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను.“ ‘అప్పుడు యెహోవానైన నేనే మిమ్మల్ని శిక్షిస్తున్నానని మీరు తెలుసుకుంటారు.’10“ ‘ఇదిగో ఆ రోజు!అది వచ్చేస్తుంది!నాశనం బయలుదేరి వచ్చేసిందిదండం వికసించింది.గర్వం చిగురించింది.11బలాత్కారం మొదలైదుష్టులను శిక్షించే దండం అయింది.ప్రజల్లో గానివారి గుంపులో గాని,ఆస్తిలో గాని,వారి ప్రఖ్యాతిలో గాని ఏదీ మిగల్లేదు.12ఆ సమయం వచ్చింది!ఆ రోజు వచ్చింది!ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది.కాబట్టి కొనేవాడు సంతోష పడనక్కరలేదుఅమ్మే వానికి దుఃఖ పడనక్కరలేదు.13అమ్మినవాడు కొన్న వాడు జీవించి ఉన్నంత కాలంఅమ్మినవాడు తాను అమ్మిన దానిని తిరిగిపొందడు.ఈ దర్శనం ఆ గుంపు అంతటికి సంబంధించినదిఅది తప్పక నెరవేరుతుంది.వారి పాపాల కారణంగా వారిలో ఎవరూతమ ప్రాణాలను రక్షించుకోలేడు.14“ ‘వారంతా సిద్ధపడియుద్ధానికి బూరలను ఊదుతారు.ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉందికాబట్టి వారిలో ఏ ఒక్కరూ యుద్ధానికి వెళ్లరు.15బయట కత్తి ఉంది;లోపల తెగులు కరువు ఉన్నాయి.బయట ఉన్నవారుకత్తి వలన చచ్చారు;పట్టణంలో ఉన్నవారుతెగులు కరువు వలన నాశనమవుతారు.16వాటినుండి తప్పించుకున్నవారుపర్వతాల మీదకు పారిపోయితమ పాపాలను బట్టివారిలో ప్రతి ఒక్కరులోయ పావురాల్లా మూల్గుతారు.17ప్రతీ చేయి బలహీనం అవుతుంది;ప్రతీ కాలు మూత్రంతో తడిసిపోతుంది.18వారు గోనెపట్ట కట్టుకుంటారుభయం వారిని ఆవరిస్తుంది.ప్రతి ఒక్కరు సిగ్గుతో తలవంచుకుంటారు,ప్రతి తల క్షౌరం చేయబడుతుంది.19“ ‘వారు తమ వెండిని వీధుల్లో పారేస్తారు,వారి బంగారం అపవిత్రంగా పరిగణించబడుతుంది.యెహోవా ఉగ్రత దినానవారి వెండి బంగారాలువారిని రక్షించలేవు.వారు పాపంలో పడడానికి అవి కారణంగా ఉన్నందుకువాటివలన వారి ఆకలి తీరదువారి కడుపు నిండదు.20అందమైన ఆభరణాల బట్టి గర్వించిహేయమైన విగ్రహాలను తయారుచేయడానికి వాటిని ఉపయోగించారు.వారు దానిని నీచమైన చిత్రాలుగా మార్చారు;కాబట్టి నేను దానిని వారి కోసం ఒక అపవిత్రమైనదానిగా చేస్తాను.21నేను వారి సంపదను విదేశీయులకు ఎరగాభూమిమీది దుర్మార్గులకు దోపుడు సొమ్ముగా అప్పగిస్తానువారే దానిని అపవిత్రపరుస్తారు.22వారిని చూడకుండ నా ముఖాన్ని త్రిప్పుకుంటాను,కాబట్టి దొంగలు నా నిధి ఉన్న స్థలాన్ని అపవిత్రపరుస్తారు.వారు దానిలోనికి వెళ్లిదానిని మలినం చేస్తారు.23“ ‘దేశమంతా రక్తంతోపట్టణమంతా హింసతో నిండిపోయిందికాబట్టి సంకెళ్ళు సిద్ధం చేయండి.24వారి ఇళ్ళను స్వాధీనం చేసుకోవడానికిప్రజల్లో అత్యంత దుష్ట జాతులను రప్పిస్తాను.నేను వారి బలవంతుల గర్వాన్ని అణచివేస్తానువారి పరిశుద్ధాలయాలు అపవిత్రం చేయబడతాయి.25భయం కలిగినప్పుడువారు సమాధానాన్ని వెదుకుతారు కాని అది దొరకదు.26నాశనం వెంబడి నాశనం వస్తుంది,పుకార్ల మీద పుకార్లు పుట్టుకొస్తాయి.వారు ప్రవక్త దగ్గరకి దర్శనం కోసం వెళ్తారుధర్మశాస్త్ర జ్ఞానం యాజకులకు ఉండదు.పెద్దలు ఆలోచన చేయరు.27రాజు దుఃఖిస్తారు,యువరాజు నిరాశకు గురవుతాడు,దేశ ప్రజల చేతులు వణకుతాయి.వారి ప్రవర్తనను బట్టి వారికి చేస్తాను,వారి సొంత ప్రమాణాల ప్రకారమే నేను వారికి తీర్పు తీరుస్తాను.“ ‘అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”