యెహెజ్కేలు15tel_otsa

యెరూషలేము పనికిరాని ద్రాక్షతీగె

1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:2“మనుష్యకుమారుడా, ద్రాక్షచెట్టు కర్ర అడవిలోని ఇతర చెట్ల కొమ్మల కంటే ఏమైనా గొప్పదా?3దాని కర్ర ఏ పనికైనా ఉపయోగపడుతుందా? ఏ పనికైనా దాని కర్రను వాడతారా? దేనినైనా తగిలించడానికి దాని కర్రతో మేకులు తయారుచేస్తారా?4లేదు కదా, అది మంటలో వేయడానికే ఉపయోగపడుతుంది. అగ్నిలో రెండు చివరలు మధ్య భాగం కాలిపోయిన తర్వాత అది దేనికైనా ఉపయోగపడుతుందా?5అది కాలక ముందే దేనికి ఉపయోగపడనప్పుడు అగ్నిలో పూర్తిగా కాలిన తర్వాత మరి దేనికి ఉపయోగపడుతుంది?6“ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: అడవి చెట్లలో ద్రాక్షచెట్టు కర్రను నేను ఎలా అగ్నికి అప్పగించానో అలానే యెరూషలేములో నివసించే ప్రజలను అప్పగిస్తాను.7నేను వారిపట్ల కఠినంగా ఉంటాను. వారు అగ్ని నుండి తప్పించుకున్నా సరే అగ్ని వారిని కాల్చివేస్తుంది. నేను వారిపట్ల కఠినంగా ఉన్నప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.8వారు నమ్మకద్రోహులుగా ఉన్నారు కాబట్టి నేను దేశాన్ని పాడుచేస్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”