ఆమోసు1tel_otsa
1యూదాకు రాజుగా ఉజ్జియా, ఇశ్రాయేలు రాజుగా యెహోయాషుకుమారుడైన యరొబాము ఉన్న సమయంలో, భూకంపం రావడానికి రెండు సంవత్సరాలు ముందే ఇశ్రాయేలు ప్రజలను గురించి తెకోవలోని గొర్రెల కాపరులలో ఒకడైన ఆమోసు చూసిన దర్శనము.2ఆమోసు ఇలా చెప్పాడు:“యెహోవా సీయోను నుండి గర్జిస్తున్నారుయెరూషలేము నుండి ఉరుముతున్నారు;కాపరుల పచ్చికబయళ్లు ఎండిపోతున్నాయి,కర్మెలు పర్వత శిఖరం వాడిపోతుంది.”